ఇండస్ట్రీ బజ్ : భారీ ఏక్షన్ లో “దేవర”.!

ఇప్పుడు RRR నటుడు గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ సినిమా సెన్సేషనల్ హిట్ తర్వాత అయితే ఎన్నో అంచనాలు నడుమ అనౌన్స్ చేసిన చిత్రమే “దేవర”. భారీ డిజాస్టర్ లో ఉన్న దర్శకుడు కొరటాల శివతో అయితే అనౌన్స్ చేసిన ఈ చిత్రం వారి కాంబినేషన్లో రెండోది కాగా ఎన్టీఆర్ కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం 30 వ సినిమాగా అయితే తెరకెక్కుతుంది.

ఇక ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ నే దింపుతున్న మేకర్స్ వారితో సినిమా షూటింగ్ ని అయితే ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. మరి ఇపుడు దేవర లో స్టార్ట్ చేస్తున్న ఓ ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ పై అయితే క్రేజీ బజ్ ఇండస్ట్రీ బజ్ వినిపిస్తుంది. కాగా ఇపుడు కొరటాల ఓ మాసివ్ ఏక్షన్ షెడ్యూల్ ని బిగిన్ చేయగా ఈ మాసివ్ షెడ్యూల్ లో అయితే హీరో ఎన్టీఆర్ సహా విలన్ సైఫ్ అలీఖాన్ లు ఇద్దరూ కూడా పాల్గొంటున్నారట.

వారిపై కీలక ఏక్షన్ సన్నివేశాలను కొరటాల తెరకెక్కిస్తుండగా ఈ టోటల్ షూట్ మొత్తం 20 రోజులు పాటుగా కొనసాగనుంది అని తెలుస్తుంది. మరి ఈ సినిమాకి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి తన సారథ్యంలోనే ఈ సీక్వెన్స్ ఉందో లేదో అనేది తెలియాలి.

ఇక ఈ చిత్రంలో అయితే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ కొత్త నిర్మాణ సంస్థ యువసుధా ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.