ఇన్సైడ్ టాక్ : సైలెంట్ గా కానిచ్చేస్తున్న పుష్ప రాజ్..?

ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తన లాస్ట్ రెండు సినిమాలు కూడా భారీ హిట్స్ కాగా ఇప్పుడు పుష్ప 2 పై అయితే పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా ఇప్పుడు సీక్వెల్ కి తాను దర్శకునిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారారు.

ఇక ఇదిలా ఉండగా సినిమా అసలు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు సతమతం అవుతున్నారు కానీ మేకర్స్ మాత్రం సరిగ్గా అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు. అయితే గత కొన్నాళ్ల కితం ఈ చిత్రం షూటింగ్ ఈ నవంబర్ లో స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కానీ అది కూడా అవ్వలేదు.

అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఓ ఇంట్రెస్టింగ్ సమాచారం వినిపిస్తుంది. మరి దీనితో అయితే ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిపోయింది అట. మరి ఈ షూట్ మొన్ననే హైదరాబాద్ లో స్టార్ట్ కాగా ఇప్పుడు సైలెంట్ గా జరిగిపోతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఏ హడావుడి లేకుండానే మేకర్స్ షూట్ స్టార్ట్ చేసేసారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక దీనితో పాటుగా వచ్చే ఏడాది కాకుండా ఆ వచ్చే ఏడాది సినిమా రిలీజ్ ఉంటుంది అని కూడా ఓ బజ్ ఉంది. వాటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.