ఇన్సైడ్ టాక్ : “దేవర” కోసం భారీగా మారబోతున్న ఎన్టీఆర్?

ntr-jr-ushers-the-era-of-worldwide-domination-with-the-success-of-rrr-001 (1)

ఇపుడు టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న పలు భారీ స్థాయి ప్రాజెక్ట్ లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో అయితే తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “దేవర” కూడా ఒకటి కాగా ఈ చిత్రాన్ని అయితే హాలీవుడ్ లెవెల్ ఎలిమెంట్స్ తో అయితే మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.

కాగా ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే విలన్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేయగా దీనికి మిక్స్డ్ స్పందన అయితే వచ్చింది. ఇక ఇదిలా ఉండగా సినిమాలో ఎన్టీఆర్ తో పాటుగా సైఫ్ అలీఖాన్ కూడా డిఫరెంట్ మేకోవర్ లో కనిపించనున్నట్టుగా వాయఱి ఫస్ట్ లుక్ పోస్టర్ లు చూస్తేనే అర్ధం అయ్యిపోయింది.

కాగా ఇప్పుడు ఎన్టీఆర్ కి సంబంధించి మరో క్రేజీ టాక్ సినీ వర్గాలు నుంచి వినిపిస్తుంది. ఈ చిత్రం సహా తన నెక్స్ట్ సినిమాలు కోసం ఎన్టీఆర్ ఇప్పుడు తన బాడీ బిల్డప్ ని మరింత స్థాయిలో పెంచబోతున్నాడు అట. ఆల్రెడీ RRR చిత్రంతోనే ఎన్టీఆర్ ని 6 ప్యాక్ లో చూసిన మనం ఇప్పుడు అంతకు మించి బాడీతో అయితే దేవర లో ఎన్టీఆర్ ని చూడబోతున్నాం అని చెప్పాలి.

కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా అనిరుద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అలాగే వచ్చే ఏడాది ఉగాది కానుకగా చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.