లేటెస్ట్ ఇన్సైడ్ టాక్ : “ఆదిపురుష్” విషయంలో ఫ్యాన్స్ కి నిరాశ తప్పేలా లేదా?

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర తీరని లోటు ప్రముఖ దర్శక నిర్మాత కృష్ణం రాజు గారి మరణంతో జరిగిన సంగతి తెలిసిందే. దీనితో వారి వారసుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కూడా కన్నీరు మున్నీరు కావడంతో ప్రభాస్ అభిమానులు మరింత భావోద్వేగానికి లోనైపోయారు.

అయితే ఈ విషాద ఘటన తర్వాతే చిన్నపాటి పాజిటివ్ వార్త అన్నట్టుగా ప్రభాస్ నటించిన ఇండియా బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా “ఆదిపురుష్” నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టు డైరెక్ట్ సినీ నిర్మాతల నుంచే ఓ క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.

కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం అయితే మేకర్స్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని తెలుస్తుంది. దసరాకి అనుకున్న డేట్ కి గాను ఎలాంటి అప్డేట్ ఇవ్వదలచుకోలేదని అందాకా ఈ డెసిషన్ ని హోల్డ్ లో పెట్టారని అంటున్నారు.

దీనితో అయితే ఎంతో కాలం నుంచి ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశ తప్పేలా లేదనే చెప్పక తప్పదు. ఇక ఈ సినిమాని అయితే రామాయణం ఆధారంగా హిందీ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తుండగా ప్రభాస్ రామునిగా, కృతి సనన్ సీతగా సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటిస్తున్నారు.