“సలార్” ట్రైలర్ ఇన్సైడ్ రిపోర్ట్స్..!

చాలా కాలం తర్వాత మళ్ళీ ఇండియన్ సినిమా షేక్ అయ్యే సినిమా అయితే ఈ డిసెంబర్ లో రాబోతుంది. యంగ్ రెబల్ స్టార్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమానే “సలార్”. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ సినిమా కౌంట్ డౌన్ రేపటి నుంచి మొదలవుతుంది.

మరి ఈ భారీ సినిమా రిలీజ్ అనేది డిసెంబర్ మొదటి తారీకు అది కూడా సినిమా అవైటెడ్ ట్రైలర్ తో మొదలు కాబోతుండడంతో దీనిపై ఉన్న హైప్ వేరే లెవెల్లో ఉంది.  మెయిన్ గా ఏక్షన్ మూవీ లవర్స్ బ్లైండ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి రేపు సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకి వస్తున్న ఈ ట్రైలర్ కి ఇన్సైడ్ రిపోర్ట్స్ తెలుస్తున్నాయి.

దీనితో ఈ ట్రైలర్ విజువల్స్ పగిలిపోయాయి అని తెలుస్తుంది. టీజర్ చూసి చాలా మంది కొంచెం డిజప్పాయింట్ అయ్యారు కానీ ట్రైలర్ మాత్రం ఫుల్ మీల్స్ పెడుతుంది అన్నట్టుగా అంటున్నారు. దీనితో ట్రైలర్ ఎవరికీ ఏ అంశంలో కూడా డిజప్పాయింట్ చెయ్యదనే అంటున్నారు.

మరి ఈ క్రేజీ ట్రైలర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ భారీ చిత్రం ఈ డిసెంబర్ 22న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అలాగే శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా కన్నడ స్టార్ నటుడు పృథ్వీరాజ్ విలన్ గా నటించాడు. అలాగే జగపతిబాబు 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.