ఇండస్ట్రీ టాక్ : సుధీర్ “గాలోడు” కి అంత బిజినెస్ జరిగిందా?

Gaalodu

కమెడియన్ సుడిగాలి సుధీర్ పేరు తెలియని వారు తెలుగు స్టేట్స్ లో ఎవరూ ఉండరు. మరి జబర్దస్త్ నుంచి స్టార్ట్ అయ్యిన తన సినిమా ప్రయాణం ఇప్పుడు తాను హీరోగా నిలిపేలా చేసింది. అయితే స్మాల్ స్క్రీన్ పై భారీ క్రేజ్ ని తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ నెక్స్ట్ హీరోగా వెండితెర అరంగేట్రం చేసాడు.

మరి ఈ ఇప్పుడు హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా కూడా తాను చేసిన మాస్ సినిమా “గాలోడు” రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా మాత్రం సుధీర్ కెరీర్ లో అనుకున్న దానికి మించి రీచ్ ని తెచ్చుకుందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా యూత్ ని ముఖ్యంగా అట్రాక్ట్ చేసి ఫస్ట్ డే చాలా చోట్ల మంచి వసూళ్లే అందుకున్నట్టు తెలుస్తుంది.

అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాకి జరిగిన బిజినెస్ ఎంతో అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సుధీర్ సినిమాకి కేవలం థియేట్రికల్ బిజినెస్ ఏకంగా 3 కోట్లకి పైగానే జరుగుతున్నట్టు ట్రేడ్ సర్క్సిల్స్ చెప్తున్నాయి.

స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చిన నటుడుగా అయితే ఇది చాలా ఎక్కువే అని డెఫినెట్ గా చెప్పాలి. అలాగే మొదటిసారి ఎగ్జాక్ట్ వసూళ్లు ఎంత వచ్చాయి అనేది తెలియాలి. అయితే ఇపుడు ఎంత వాసులు అయినప్పటికీ అందులో ప్రతి రూపాయి కేవలం సుధీర్ మొహాన్ని చూసి వచ్చిందే అని చెప్పొచ్చు.