ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్న పలు క్రేజీ కాంబినేషన్స్ లో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మాస్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని అయితే ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా..
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ఇన్ని రోజులు నాన్ స్టాప్ గా అయితే నడిచింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు చిన్న వెకేషన్ లో ఉండగా లేటెస్ట్ గా అయితే మహేష్ గుంటూరు కారం లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఇపుడు వరకు వర్క్ చేసిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి ఎస్ వినోద్ అయితే సినిమా నుంచి బయటకి వెళ్ళిపోయినట్టుగా తెలుసుంది. అయితే కారణం ఏంటి అనేది ఇంకా బయటకి రాలేదు కానీ మరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయితే తన ప్లేస్ ని రీప్లేస్ చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.
మరి అతను ఎవరో కాదు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ ఆ=కళ్యాణ్ చేస్తున్న భారీ చిత్రం ఓజి, అలాగే లాస్ట్ టైం భీమ్లా నాయక్ చిత్రాలకి వర్క్ చేసిన రవి కె చంద్రన్ రాబోతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.
