ఇండస్ట్రీ టాక్ : ప్రభాస్ తరహాలో పవన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారా?

NBK-vs-PK-Unstoppable-Promo_-A-Repetitive-Trope

ప్రస్తుతం ఉన్న ఎంటర్టైనింగ్ ప్రపంచంలో ఓటిటి బాగా పాపులర్ అయ్యింది. అనేక భాషల్లో కంటెంట్ ఆడియెన్స్ కి అరచేతిలోనే దొరుకుతూ ఉండడంతో ఆడియెన్స్ కి పోటాపోటీగా సరికొత్త కంటెంట్ ఇవ్వాలని పలు ఓటిటి సంస్థలు అయితే పోటీ పడుతున్నాయి. మరి అలాగే మన తెలుగు నుంచి వచ్చిన మొదటి స్ట్రీమింగ్ యాప్ ఆహా వాళ్ళు చేసిన ప్రయోగాత్మక టాక్ షో నే “అన్ స్టాప్పబుల్ విత్ నందమూరి బాలకృష్ణ”.

ఈ షో కి బాలయ్య ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ నుంచి తన కెరీర్ లో సరికొత్త చాప్టర్ మొదలు అని చెప్పాలి తాను హోస్ట్ గా అదరగొట్టగా ఇప్పుడు రెండో సీజన్లో కూడా ఊహినఃకాని అతిథులతో తన మార్క్ హోస్టింగ్ తో కుమ్మేస్తున్నారు బాలయ్య. కాగా రీసెంట్ గానే ఆహా హిస్టరీ లోనే భారీ రికార్డు నమోదు చేసిన ఎపిసోడ్ ప్రభాస్ తో వచ్చింది.

ఇక దీని తర్వాత అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అదిరే ఎపిసోడ్ ని ప్లాన్ చేయగా దీనిపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ మాసివ్ ఎపిసోడ్ పై అయితే లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ ని కూడా రెండు భాగాలుగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

గతంలో ప్రభాస్ ఎపిసోడ్ ని ఎలా అయితే రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కి తెచ్చారో ఇప్పుడు ఇదే ప్లానింగ్ లో పవన్ ఎపిసోడ్ ని కూడా తీసుకురానున్నారట. అంటే రెండు గంటల పాటు వీరి ఎపిసోడ్ ఉంటుంది అని చెప్పాలి. కాగా ఈ ఎపిసోడ్ మొదటి భాగం ఈ ఫిబ్రవరి 3న స్ట్రీమింగ్ కి రావచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి.