ఇండస్ట్రీ టాక్ : “పుష్ప 2” లో లేడీ పవర్ స్టార్ ఇలా కనిపిస్తుందా?

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ హైప్ తో ఉన్న పలు చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా “పుష్ప ది రూల్” కూడా ఒకటి. వరల్డ్ వైడ్ గా ఏకంగా భారీ మొత్తంలో 1000 కోట్ల మేర బిజినెస్ చేయగలిగే సత్తా ఉన్న సినిమాగా ఇది రానుండగా దర్శకుడు సుకుమార్ అయితే పార్ట్ కన్నా భారీ హంగులతో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.

అయితే కాస్టింగ్ పరంగా పార్ట్ 2 కి కి భారీ మార్పులు కనిపించనుండగా వారిలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కూడా కనిపించనున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. పుష్ప కాస్టింగ్ లో సాయి పల్లవికి ఓ కీలక పాత్ర ఉంది అని ఆమె కూడా ఓకే చెప్పినట్టుగా పలు రూమర్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో మొదలయ్యాయి.

అంతే కాకుండా షూటింగ్ కూడా సాయి పల్లవి సిద్ధం అయ్యినట్టుగా ఊహాగానాలు వినిపిస్తన్నాయి. మరి ఈ సినిమాలో సాయి పల్లవి ఎలాంటి రోల్ లో కనిపిస్తుంది అనే మాట కూడా ఇప్పుడు కొందరిలో ఉంది. మరి దీనికి అయితే సాయి పల్లవి ఓ గిరిజన యువతిగా కనిపిస్తుందని అంటున్నారు.

మరి ఇప్పుడైతే ఈ అప్డేట్ గట్టిగానే వైరల్ గా మారింది. కాగా ఇదెంత వరకు నిజం అనేది చిత్ర యూనిట్ ఖరారు చేసే వరకు తెలియదు. ఒకవేళ కన్ఫర్మ్ చేస్తే ఈ సినిమాకి మరింత హైప్ నెలకొంటుంది అని చెప్పి తీరాలి.