“పుష్ప” “బాహుబలి” తరహాలో వచ్చిన “భారతీయుడు 2”

ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో సినిమాలకి నిడివి అనేది పెద్ద మేటర్ కాదని చెప్పాలి. ఒకప్పుడు హాలీవుడ్ లో చిత్రాలు కేవలం గంటన్నర రెండు గంటలు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు వారు కూడా సుమారు 3 గంటలు అంతకు మించి కూడా సినిమాలు చేస్తున్నారు.

ఐతే ఇక మన ఇండియన్ సినిమా నుంచి కూడా సరైన కంటెంట్ ఇస్తే మూడు గంటలు ఆడియెన్స్ థియేటర్స్ లో కూర్చొని ఈజీగా సినిమా చూస్తారు అని ప్రూవ్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. దీనితో సినిమా తీసినప్పుడే భారీ నిడివి వస్తే వాటిని రెండు భాగాలుగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే గతంలో సింగిల్ పార్ట్ గానే స్టార్ట్ చేసిన భారీ చిత్రం బాహుబలి ఉండి ఉండి ఏకంగా 5 గంటల మేర నిడివి వచ్చేసింది. దీనితో మేకర్స్ దాన్ని ఒక్క భాగంగా చెప్తే సరిపోదు అని రెండు భాగాలుగా విభజించారు. అయితే దీని తర్వాత మళ్ళీ సుకుమార్ ప్లాన్ చేసిన “పుష్ప” కి కూడా జరిగింది.

ఈ చిత్రం తెరకెక్కించాక ఇంటర్వెల్ సీన్ నిజానికి క్లైమాక్స్ లో సీన్ కి వచ్చిందట. దీనితో మధ్యలో వెబ్ సిరీస్ గా ఏమన్నా ప్లాన్ చేద్దాం అనుకున్నారు కానీ ఫైనల్ గా మూడు భాగాలుగా దీనిని స్తే చేశారు. ఇక ఇప్పుడు వీటి తరహాలో దర్శకుడు శంకర్ ఉలగనయగన్ కమల్ హాసన్ గా సెన్సేషనల్ సీక్వెల్ “భారతీయుడు 2” భారీ నిడివితో వచ్చినను అని తెలుస్తుంది.

కాగా ఈ చిత్రం ఏకంగా 6 గంటల నిడివి ఇప్పటి వరకు వచ్చిందట. దీనితో మేకర్స్ ఇక ఈ చిత్రాన్ని భారతీయుడు 2, 3 పార్ట్ లుగా రిలీజ్ చేయనున్నారు అని తమిళ సినీ వర్గాల వారు చెప్తున్నారు. ఇప్పుడు రెండు భాగాల షూటింగ్ ఒకేసారి చేస్తున్నారని మరో భోగట్టా.