ఆస్కార్ కోసం రాజమౌళి పెట్టిన ఖర్చు తెలిస్తే … ముక్కున వేలేసుకోవాల్సిందే!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.అపజయం ఎరుగని దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో పేరు సంపాదించుకున్న బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు. ఇలా బాహుబలి రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనాలను సృష్టించింది. ఇకపోతే తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆదరణ పొందిందో మనకు తెలిసింది.

ఈ విధంగా త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా అందుకుంది. ఇలా ఈ సినిమా చూసిన ఎంతోమంది హాలీవుడ్ దర్శకుల సైతం రాజమౌళి పై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఈ సినిమా తప్పనిసరిగా ఆస్కార్ రేసులో ఉంటుందని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా ఆస్కార్ బరిలో పెట్టుకున్నా లేకపోయినా ఈ సినిమాని ఎలాగైనా ఆస్కార్ బరిలో దింపాలని రాజమౌళి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు.

రాజమౌళి తన సినిమాని ఆస్కార్ కి నామినేట్ చేయడం కోసం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రొఫెషనల్ ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు కనిపిస్తుంది. దీనికోసం రాజమౌళి భారీగానే ఖర్చు చేశారట. ఇలా ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్ల కోసం రాజమౌళి సుమారుగా 80 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ విషయం తెలిసిన ఎంతోమంది ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి రాజమౌళి పడిన ఈ కష్టానికి ఫలితం లభిస్తుందా లేదా తెలియాల్సి ఉంది..