Kiran Abbavaram: ప్రతీ సినిమాకీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా కేర్ తీసుకోవడానికి… మరియు సక్సెస్ వచ్చిన తర్వాత ఇక అంతా వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటారు చాలా మంది కానీ తాను మాత్రం ఫస్ట్ సినిమా నుంచి ఆదే ఫాలో కావడానికి ముఖ్య కారణం ఏమిటంటే.. తనకు మామూలుగా భయం ఎక్కువ అని, తాను ఏ విషయంలో నైనా భయపడతాను అంటే అది కేవలం సినిమా విషయంలో మాత్రమే అని ప్రముఖ నటుడు కిరణ్ అబ్బవరం అన్నారు. సినిమా స్టార్ట్ చేశాము.. ఒకవేళ అది ఏదో కారణాల వల్ల ఆగిపోతే ఏదో పరువు పోయినట్టు ఫీలయిపోతూ ఉంటానని, ఆ రోజు షూట్ ఆగిపోయిందంటే, అది ఎందుకు జరగలేదు? దాని బాధ్యత మనం తీసుకుందామా అని అనిపిస్తూంటుందని కిరణ్ చెప్పారు. సినిమాకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా చూసినప్పుడు తనకు ఏదైనా చేయాలనిపిస్తూ ఉంటుందని ఆయన అన్నారు.
సినిమా అనేది ఎంత ఇంపార్టెంటో తనకు చాలా బాగా తెలుసునని కిరణ్ చెప్పారు. ఈ అవకాశం రావడం కోసం ఎంత కష్టపడ్డానో ఎంత వెయిట్ చేశానో అని, ఈ రోజు ఈ సినిమాకు చేస్తున్నాను అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉంటానని, అలా తాను ఫీలవుతూ ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ అవకాశం అందరికీ దక్కదని ఆయన చెప్పారు. అలా ఏవో కొన్ని కారణాల వల్ల కావచ్చు, కొందరి ఎమోషన్స్ కోసం కావచ్చు, కొంత మంది మనీ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు.. ఏం జరిగినా సరే సినిమా మాత్రం ఆపొద్దు అని, పోతే ఏవుతుంది కేవలం మనీ పోతుంది అంతే గానీ సినిమా మాత్రం ఆపకుండా కంటిన్యూ చేయాలని ఆయన కోరారు.
తాము చేసేదే సినిమా కోసం కాబట్టి, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు అని ఆయన చెప్పారు. తనకు తెలియని ఎమోషన్ ఎప్పుడూ అలా తనను వెంటాడుతూ ఉంటుందని కిరణ్ చెప్పారు. ఎందుకంటే దాని కోసమే కదా ఇంత దూరం వచ్చి, ఇన్ని కష్టాలు పడింది అని ఆయన అన్నారు. ఏదేమైనా సరే, తనకు పది రూపాయలు రాకున్నా పర్లేదు గానీ, సినిమానైతే వదలొద్దు అని ఆయన కరాఖండిగా చెప్పేశారు. అన్నీ మన చేతుల్లో ఉండక పోవచ్చు కానీ, తనకు వీలైనంత వరకూ మాత్రం తాను ప్రయత్నిస్తూ ఉంటానని ఆయన స్పష్టం చేశారు.