Prabhas – Allu Arjun: సాధారణంగా ఒక సినిమా విడుదల అవుతుందంటే ఆ సినిమా కోసం ఇతర హీరోలు కూడా ప్రమోట్ చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే భీమ్లా నాయక్ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాపై ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడమే కాకుండా సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే ఈ సినిమాపై అల్లు అర్జున్ నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఇక ఎట్టకేలకు బన్నీ తన కుటుంబ సభ్యులతో కలిసి భీమ్లా నాయక్ సినిమాను థియేటర్లో చూసినప్పటికీ ఈ సినిమా గురించి ప్రస్తావించక పోవడం గమనార్హం. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రభాస్ సినిమాల్లోకి రాకముందే మంచి స్నేహితులు ఈ క్రమంలోనే వీరిద్దరూ వారి నటించిన సినిమాలకు ఒకరికొకరు ప్రమోషన్ చేసుకుంటూ ఉండటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ ఈ నెల 11 వ తేదీవిడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి అల్లుఅర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సైతం ఈ సినిమాని మొదటి రోజు చూడడం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పటం విశేషం. ఇక ప్రభాస్ కూడా ఇదివరకు అల్లు అర్జున్ నటించిన సినిమాల గురించి ప్రశంసలు కురిపించిన విషయం మనకు తెలిసిందే.