అలాంటి పాత్రలు వస్తే బాలీవుడ్ రీ-ఎంట్రీ ఇస్తా.. సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్!

ఎన్నో తెలుగు తమిళ సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకని ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో లవర్ బాయ్ అని పేరు సంపాదించుకున్న నటుడు సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన గతంలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండేవారు.అయితే ప్రస్తుతం అతనికి అవకాశాలు తగ్గిపోవడంతో సినిమాలలో కన్నా వివిధ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా నిత్యం సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.ఇక చాలా సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్ మహాసముద్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. అయితే ఈ సినిమా తరువాత సిద్ధార్థ్ ఇప్పటివరకు ఎలాంటి కొత్త సినిమాలను ప్రకటించలేదు. కానీ హిందీ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎస్కేప్‌ లైవ్‌ అనే హిందీ వెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిరీస్‌ డిస్నీ+హాట్ స్టార్ లో మే 20 నుంచి ప్రీమియర్ కానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సిరీస్ లో తన పాత్ర ఎంతో వైవిధ్యభరితమైనదని, ఇలాంటి పాత్రలో నటించే అవకాశాన్ని తనకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని సిద్ధార్థ్ వెల్లడించారు. ఇక ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు దొరికితే తప్పకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తానని ఆయన తెలియజేశారు. తనకు ఎంతో విభిన్న పాత్రలు దొరికితేనే నటిస్తానని, ఎప్పుడైతే అలాంటి పాత్రలు రావో ఆ సమయంలో నేను యాక్టింగ్ మానేసి వేరే ఉద్యోగం చూసుకుంటానని సిద్ధార్థ్ ఈ సందర్భంగా వెల్లడించారు.