ఆ డైరెక్టర్ తో నటించాలని ఉంది…. మనసులో కోరికను బయటపెట్టిన ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఎన్నో రకాల ప్రశ్నలను వేస్తూ ప్రభాస్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తన సినీ కెరియర్ లో ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్లతో నటించారు. అయితే తనకు మాత్రం ఒక డైరెక్టర్ తో నటించాలని ఉందని తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.

ఈ సందర్భంగా ప్రభాస్ తనకి ఇష్టమైన డైరెక్టర్ల గురించి మాట్లాడుతూ తనకు డైరెక్టర్ మణిరత్నం గారు అంటే చాలా అభిమానం అని ఆయనతో సినిమా చేయాలని ఉంది అంటూ తెలియజేశారు.మణిరత్నం గారు తనతో సినిమా చేస్తారో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఉంది అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ కామెంట్ చేశారు. మరి మణిరత్నం ఈ పాన్ ఇండియా హీరోకి అవకాశం కల్పించి తన కోరిక తీరుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

అదేవిధంగా మరొక డైరెక్టర్ గురించి కూడా మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన సినిమాలను అందించినటువంటి లెజెండరీ డైరెక్టర్ బాపుగారు అంటే తనకు చాలా అభిమానం గౌరవమని తెలిపారు.ఇద్దరు డైరెక్టర్లు అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా ప్రభాస్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక బాపు గురించి బాలకృష్ణ కూడా మాట్లాడుతూ తనకు బాపుగారు అంటే ఎంతో నమ్మకం గౌరవమని అదే గౌరవంతోనే ఆయన దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలో నటించానని తెలిపారు.