Actress Jayavani: విలన్ టైప్ క్యారెక్టర్స్ చేయడం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా నుంచి మొదలైందని ప్రముఖ ఆర్టిస్ట్ జయవాణి అన్నారు. తనకు అప్పుడు చేసిన షూటింగ్ సీన్స్ ఇప్పటికీ గుర్తు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు ఎందుకంటే అప్పటి వరకూ చేసిన క్యారెక్టర్స్ లలో ఏవి కూడా అరవడం, గట్టిగా మాట్లాడడం లాంటి పాత్రలు తాను చేయలేదని ఆమె తెలిపారు. అదే విక్రమార్కుడు సినిమాకి వచ్చేటప్పటికి అరేయ్ సత్తిగా.. సచ్చినోడా.. ఇలాంటి అరిచే డైలాగులు ఉన్నాయని ఆమె ఆన్నారు.
విక్రమార్కుడు సినిమాకు సంబంధించి షూటింగ్ అంతా అయిపోయాక డైరెక్టర్ రాజమౌళి తను డబ్బింగ్ కోసం పిలిస్తే తాను రానని చెప్పేసి నట్టు ఆమె తెలిపారు. తనకు ముందు నుంచి డబ్బింగ్ అంటే చాలా భయం అని అది ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉందని ఇప్పుడు కూడా తనకు డబ్బింగ్ చెప్పాలంటే భయపడుతూ ఉంటానని ఆమె చెప్పారు. షూటింగ్ స్పాట్ లో యాక్టింగ్ చేయమంటే చచ్చిపోతా అని కానీ అదే డబ్బింగ్ చెప్పమంటే మాత్రం చాలా భయపడుతానని అని ఆమె అన్నారు. అందుకే కృష్ణవంశీగారు కూడా ఎప్పుడు ఇక్కడ చచ్చిపోతావు అక్కడికెళ్తే చచ్చిపోతావు అని అంటూ ఉంటారని ఆమె నవ్వుతూ చెప్పారు. అదే డబ్బింగ్ దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం అది తన వల్ల కాదని ఆమె అన్నారు. షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలో ఎంత అగ్రెసివ్ గా చేయాలో అలా నటిస్తానని, ఆ పాత్రకు వందశాతం న్యాయం చేస్తానని ఆమె తెలిపారు. అదే డబ్బింగ్ విషయానికి వచ్చేసరికి తాను చెప్పలేనని ఆమె అన్నారు ఆ డైలాగులు చెప్పాలంటే మళ్ళీ అలా ఫీల్ అయితే కానీ చెప్పలేనేమోనని ఆమె స్పష్టం చేశారు.
ఇక మహాత్మా సినిమా విషయానికి వచ్చేసరికి అందులో తాను విలన్ క్యారెక్టర్ చేశానని ఆమె చెప్పారు. నిజంగా ఆ పాత్ర తనకు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. డైరెక్టర్ గారికి ఉన్న స్థాయిని బట్టి చూస్తే ఆ క్యారెక్టర్ ను ఎవరో తనకు తెలిసిన పాత వాళ్లకు ఇవ్వచ్చు. కానీ వారెవరికీ ఇవ్వకుండా తనకు ఇచ్చారని అది చాలా చెప్పుకోదగిన విషయంగా భావిస్తానని ఆమె అన్నారు. అప్పటివరకు తనకు చిన్న చిన్న క్యారెక్టర్లు మాత్రమే వచ్చాయని ఆ సినిమాతో తనకు చాలా మంచి పేరు వచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అందులో క్యారెక్టర్ చాలా అగ్రెసివ్ గా ఉంటుందన్న ఆమె, డబ్బింగ్ చెప్పమంటే మాత్రం తనకు దాదాపుగా ఏడు లేదా ఎనిమిది రోజులు పడుతుందని, అంత కష్టం మీకెందుకు అని అసోసియేట్స్ తో తాను చెప్పినట్టు ఆమె సరదాగా అన్నారు.
