చిన్నప్పటినుంచి హాస్టల్లోనే పెరిగాను.. బాల్యాన్ని గుర్తు చేసుకున్న రష్మిక!

ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో ఊహించని విధంగా వరుస సినిమాలలో నటించిన ఈమె సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈమె ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బాల్యం మొత్తం ఎక్కువగా హాస్టల్లోనే గడిచిపోయిందని ఈమె తెలిపారు. ఇలా హాస్టల్లో ఉన్నప్పటికీ తన చుట్టూ ఎప్పుడు స్నేహితులు ఉండేవారని వారినే తన కుటుంబంలా భావించానని రష్మిక పేర్కొన్నారు. ఇక టీచర్ల పట్ల ఎంతో గౌరవంగా ఉండేదాన్ని వారిలోనే అమ్మను చూసుకునే దాన్ని అంటూ రష్మిక పేర్కొన్నారు.

ఇక చదువు విషయానికి వస్తే తాను స్కూల్ చదువుతున్న రోజులలో యావరేజ్ స్టూడెంట్ అని ప్లస్2 డిగ్రీలో మాత్రం క్లాస్ టాఫర్ గా ఉన్నానని ఈమె తెలియజేశారు.ఇక తనకు మాథ్స్ అన్న బయాలజీ అన్న చాలా భయమని అందుకే ఇంటర్లో సీఈసీ తీసుకున్నాను అంటూ ఈ సందర్భంగా రష్మిక తన బాల్యం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇకపోతే రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం గుడ్ బై సినిమా అక్టోబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల అనంతరం ఈమె పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీకానున్నారు.