ఈ ప్రశ్న విని చిరాకు పుడుతుంది.. వేరే ప్రశ్నలేమీ లేవా: రష్మిక

ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి రష్మిక. ఈమె కేవలం దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు.ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక విజయ్ దేవరకొండ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వీరిద్దరూ కలిసి గీతగోవిందం సినిమాలో నటించారు. ఈ సినిమా నుంచి వీరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ విధంగా వీరి రిలేషన్ గురించి తరచూ వార్తలు రావడంతో ఎన్నోసార్లు వీరిద్దరూ ఈ వార్తలను కొట్టి పారేశారు. తాజాగా విజయ్ దేవరకొండ రష్మికను డార్లింగ్ అంటూ చెప్పడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలోనే తాజాగా ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో భాగంగా రష్మికకు మరోసారి విజయ్ దేవరకొండ తనకు మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నలకు ఈసారి రష్మిక కాస్త భిన్నంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమెకు ఈ ప్రశ్న ఎదురవడంతో… ఎప్పుడు ఇదే ప్రశ్ననేనా తాను ఏడాదికి నాలుగైదు సినిమాలలో నటిస్తున్నానని అడగాలనుకుంటే ఈ సినిమాల గురించి అడగండి తరచూ ఇదే ప్రశ్న విని విని చిరాకు వస్తుంది అంటూ కామెంట్ చేశారు.

తన గురించి అడగటానికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని, కానీ ఇలాంటి ప్రశ్నలతో అసహనం వేస్తోందని ఈమె తెలిపారు.సాధారణంగా సెలబ్రిటీల గురించి ఈ విధమైనటువంటి ప్రశ్నలు తలెత్తడం సర్వసాధారణం అయితే నేను నా సినీ కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి తనకు ఇదే ప్రశ్న ఎదురవుతూ ఉందని ఈమె సమాధానం చెప్పారు.ఇక ఇప్పుడు చెప్పేది ఒకటేనని స్వయాన నా అంతట నేనే ఇలాంటి విషయాల గురించి చెప్పే వరకు ఎవరు నా వ్యక్తిగత జీవితం గురించి ఒక నిర్ణయానికి రాకండి అంటూ ఈసారి ఈ విషయంపై రష్మిక ఘాటుగా సమాధానం చెప్పారు. ప్రస్తుత రష్మిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.