Kangana: కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలు పడ్డా…ఇండస్ట్రీలో నుంచి పంపించాలని చూశారు: కంగనా

Kangana: వివాదాల రాని కంగనా రానౌత్ మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కంగనారనౌత్. ఈ కాంట్రవర్సి క్వీన్ సోషల్ మీడియాలో ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ చేస్తూనే ఉంటుంది. ఎటువంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా బాలీవుడ్ లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. అవతలి వాళ్లు ఎలాంటి వ్యక్తి అయినా నిర్మొహమాటంగా వారిపై తనదైన స్టైల్లో కామెంట్లను స్తంభిస్తుంది.

ఇక కంగనా తన రాబోయే మూవీ తేజస్ లో ఎయిర్ పైలట్ గా కన్పించనుంది. ఈ సినిమాకు సర్వేష్ మేవారా డైరెక్టర్. ఇంకా కంగనా చేతిలోయాక్షన్ ప్యాకెడ్ మూవీ “దక్కాడ్”, మణికర్ణిక రిటర్న్స్, ది లెజెండ్స్ అఫ్ దిద్ధా ఉన్నాయి. ఇక బుల్లి తెర పై లాక్ అప్ అనే షో కి హోస్ట్ గా కూడా చేస్తోంది. లాకప్ రియాలిటీ షోని ఏక్తాకపూర్ నిర్మిస్తున్నారు.రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది కంగనా రనౌత్. కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేసింది.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ కి రావటం వలన అందరూ తనని ఏడిపించే వాళ్ళని, కంగనా వచ్చిన ప్రదేశం గురించి, ఆమె భాష గురించి అవహేళన చేసేవారని చెప్పింది. కొంతమంది అయితే ఇలాంటి వారు సినిమాకి పనికి రారు,ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మొహం మీదే చెప్పేవారని తనని ఇండస్ట్రీ నుంచి వెళ్లగొట్టాలని చూశారని చెప్పింది.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏక్తాకపూర్ తనకు అండగా ఉన్నారని చెప్పుకొచ్చింది.అందరూ తనను తిడుతున్నా తనని అర్ధం చేసుకుంది మాత్రం నిర్మాత ఏక్తా కపూర్ అంటోంది కంగనా. అందరిలా ఏక్తా కపూర్ అలా అన్లేదు. కెరీర్ స్టాటింగ్ టైంలో ఆమెతో కలిసి పనిచేశానంటోంది. ఆమె చాలా మంచి వ్యక్తి అంటున్న కంగనా తనకు ఫస్ట్ హిట్ ఇచ్చింది కూడా ఏక్తా కపూరే అంటుంది. ఇండస్ట్రీ కంగనాను ఒంటరిని చేసినా.. ఏక్తా కపూర్ మాత్రం ఎప్పుడూ.. తనకు మద్దతు ఇస్తూనే ఉంటున్నారని ఏక్తాకపూర్ తో తన అనుబంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.