మీకు చెక్ బుక్ ఉందా.. ఈ రూల్స్ పాటించకపోతే మీ క్రెడిట్ స్కోర్?

ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో ఆర్టిక లావాదేవిలు జరపాలంటే చెక్ బుక్ ఎంతో అవసరం. అయితే ఈ చెక్ బుక్కులను ఉపయోగించేవారు చెక్ రాసేటప్పుడు ఎన్నో విషయాలను గుర్తు పెట్టుకొని చాలా జాగ్రత్తగా చెక్ రాయాల్సి ఉంటుంది ఇందులో ఏ మాత్రం పొరపాట్లు జరిగిన చెక్ బౌన్స్ అవుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే ఇలా చెక్ బౌన్స్ వల్ల ఇకపై సమస్యలు ఎదుర్కోకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం చెక్ బుక్ విషయంలో సరికొత్త రూల్స్ అమల లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

చెక్ జారీ చేసే వారి ఇతర బ్యాంక్ ఖాతాలను చెక్ బుక్‌కు లింక్ చేయడం, అలాగే చెక్ బౌన్స్ అయిన వారు మళ్లీ కొత్త అకౌంట్లను ఓపెన్ చేయకుండా ఉండడం కోసం చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు తక్కువగా ఉంటే ఇతర బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కట్ చేసే విధంగా కొత్త రూల్ అమలులోకి తీసుకురానుది.చెక్ బౌన్స్ అయితే దాన్ని లోన్ డిఫాల్ట్‌గా భావించాలని కొందరు భావిస్తున్నారు. ఈ డిఫాల్ట్ విషయాన్నీ క్రెడిట్ బ్యూరో సమస్థలకు తెలియజేయాల్సి ఉంటుంది.

ఆ సమయంలో క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది కనుక దీనిని డిఫాల్ట్ గా గుర్తించాలని కొందరు భావిస్తున్నారు.ఈ కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే ఇకపై చెక్ బౌన్స్ అయినా కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉండదని తెలుస్తోంది. ఇక డబ్బులు అకౌంట్ లో తక్కువగా ఉంటే కస్టమర్ చెక్ జారీ చేయకుండా ఉంటారు.అయితే ఈ కొత్త ప్రతిపాదన బ్యాంక్ ఇంటిగ్రేషన్ ద్వారా అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.