Abhishek Bachchan: పాన్ ఇండియా అనే పదాన్ని నేను నమ్మను…పాన్ ఇండియా సినిమాలు గురించి కామెంట్ చేసిన అభిషేక్ బచ్చన్!

Abhishek Bachchan: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తనయుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్ తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకోని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్ తాజాగా నటించిన చిత్రం ‘దస్వీ’. ఈ చిత్రంతో అభిషేక్ బచ్చన్ నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చదువుకున్న ప్రాధాన్యతను వివరిస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్బచ్చన్ సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలలో మంచి కంటెంట్ లేదు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన అభిషేక్ బచ్చన్ ను ఆ వాదనను తిరస్కరించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో మంచి చిత్రాలు విడుదలవుతున్నాయి అని వెల్లడించారు. ఇక పాన్ ఇండియా సినిమాలు పై తనకు నమ్మకం లేదని అభిషేక్ తెలియజేశారు.సినిమా ఏ భాషలో తెరకెక్కిన చివరికి అది హిట్ అయితేనే సినిమా గా పరిగణిస్తారు సినిమాకి భాషతో సంబంధం లేదు… ఏ భాషలో వచ్చిన చివరికి అది సినిమానే అంటూ అభిషేక్ తెలియజేశారు.

పాన్ ఇండియా పదంపై తనకు నమ్మకం లేదని ఈ పదం కేవలం సినిమా ఇండస్ట్రీలోనే వినపడుతుంది అని మరే ఇండస్ట్రీలోనూ ఉపయోగించడం లేదని తెలియజేశారు. ఈ క్రమంలోనే బాహుబలి, కే జి ఎఫ్, పుష్ప, RRR సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఎక్కడైనా హిట్టవుతుందని, మంచి కలెక్షన్లను రాబడుతోందని, కంటెంట్ లేని సినిమా ఫ్లాప్ అవుతుందని ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.