టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్రతారగా ఎంతో మంది అగ్ర హీరోల సరసన నటించి గుర్తింపు సంపాదించుకున్న నటి రమ్యకృష్ణ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇలా హీరోయిన్ గా విలన్ గా ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఏలిన రమ్యకృష్ణ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తున్నటువంటి ఈమె తన నటనతో మరోసారి అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఊహించని విధంగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.ఇక ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు తల్లి పాత్రలో నటించినటువంటి రమ్యకృష్ణ మరోసారి తన మాస్ పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన సినిమాల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
దక్షిణాది ఇండస్ట్రీలో తెలుగు తమిళ భాషలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రమ్యకృష్ణ ఇక్కడ అగ్రతారక వెలుగుతున్న సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిర్మాణ సంస్థలో, అలాగే స్టార్ హీరోల సరసన నటించారు.ఇలా అగ్ర హీరోల సరసన నటించినప్పటికీ ఆ సినిమాలు మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి మాట్లాడుతూ బాలీవుడ్ సినిమాలు తనకు కలిసి రాలేదని అందుకే తాను నటించిన ప్రతి సినిమా కూడా హిట్ కాలేకపోయిందని ఈ సందర్భంగా రమ్యకృష్ణ బాలీవుడ్ సినిమాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.