తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నాగార్జున అలాగే నాగచైతన్య అఖిల్ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ హీరోలుగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ విధంగా నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగార్జునకు జీవితంలో మీరు అత్యంత బాధపడిన సంఘటన ఏది అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు నాగర్జున సమాధానం చెబుతూ చిన్నప్పుడు చైతు తన ఇంటి నుంచి వెళ్లిపోవడం తనకు చాలా బాధ కలిగించిందని ఆ క్షణం తాను ఏడ్చాను అంటూ నాగార్జున వెల్లడించారు.
నాగచైతన్య చిన్నప్పుడు అంత దగ్గుబాటి రామానాయుడు గారి ఇంట్లోనే పెరిగారు. అయితే సెలవులకు మాత్రమే తన దగ్గరకు వచ్చేవారని సెలవల సమయంలో నేను నాగచైతన్యతో కలిసి బాగా ఎంజాయ్ చేసే వాణ్ణి.సెలవులు పూర్తి కాగానే నాగచైతన్య తన వస్తువులు తన లగేజీ సర్దుకొని వెళ్ళిపోతున్న సమయంలో తను ఎన్నోసార్లు ఏడ్చానని తెలిపారు. తర్వాత సెలవులకి ఇక్కడికే వస్తాను కదా నాన్న అని నాగచైతన్య చెప్పిన కూడా తాను ఎన్నోసార్లు బాధపడ్డానని నాగార్జున వెల్లడించారు.
ఇలా నాగార్జున ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే నాగార్జున మొదటిగా దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నారు. నాగచైతన్య పుట్టిన తర్వాత పలు మనస్పర్ధలు కారణంగా ఈమె విడాకులు తీసుకొని విడిపోవడంతో నాగచైతన్య చిన్నతనం అంతా కూడా తల్లి లక్ష్మీ దగ్గర పెరిగారు.పెద్దయ్యాక నాగార్జున తన తండ్రి వద్ద ఉన్నారు. ఇక నాగచైతన్య కూడా పెళ్లి చేసుకుని తన భార్య సమంతకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.