Actress Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో నటి మీనా ఒకరు. ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో తల్లి పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక మీనా బాలనటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో తమిళ సినిమాలలో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించారు అనంతరం చిన్న వయసులోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా హీరోయిన్గా తెలుగు తమిళ భాష చిత్రాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
ఇలా మీనా హీరోయిన్గా తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె ఐటీ ఉద్యోగి విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం తెలిసిందే. ఇలా భర్త మరణం తర్వాత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన మీనాను ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడం కోసం నిత్యం ఎంతో మంది హీరోయిన్లు ఆమెను కలుస్తూ ఆమెతో సరదాగా సమయాన్ని గడుపుతూ తనని ఆ బాధ నుంచి బయటకు తీసుకువచ్చారు.
ఇక మీనా కూడా ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా మీ నా భర్త చనిపోవడంతో ఈమె రెండో పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలను మీనా ఖండించారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పెళ్ళికి ముందు తాను ఒక హీరోని ప్రాణంగా ప్రేమించాను అంటూ ఓపెన్ అయ్యారు. మరి మీ నా ప్రాణంగా ప్రేమించిన ఆ హీరో ఎవరు? ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు అనే విషయానికి వస్తే… తాను చిన్నగా ఉన్నప్పుడు నటుడు హృతిక్ రోషన్ కు చాలా పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు మిస్ కాకుండా చూస్తూ ఉండేదాన్ని. హృతిక్ రోషన్ ని చూపిస్తూ అమ్మ నేను కూడా ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంటూ తనతో చెప్పేదాన్ని అని మీనా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా హృతిక్ రోషన్ అంటే తనకు ఉన్న అభిమానం బయటపెట్టారు దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.