మనో, రోజాల పరువు తీసేశాడు.. హైపర్ ఆది పంచ్‌కు అంతా షాక్

జబర్దస్త్ షోలో హైపర్ ఆది వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. హైపర్ ఆదికి వారు వీరు అన్న తేడా అందరి మీద కౌంటర్లు వేస్తుంటారు. చివరకు మల్లెమాల, శ్యాం ప్రసాద్ రెడ్డి, రోజా ఇలా అందరి మీదా కౌంటర్లు వేస్తాడు. అయితే అందరూ కూడా లైట్‌గానే తీసుకుంటుంటారు. ఇక జడ్జ్‌లుగా ఉండే రోజా, మనోల మీద కూడా సెటైర్లు పడుతుంటాయి. ఇక యాంకర్ అనసూయను హైపర్ ఆది తన స్కిట్‌లలో ఎలా వాడుకుంటాడో అందరికీ తెలిసిందే.

వచ్చే వారం ప్రసారం కానున్న జబర్దస్త్ ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. అందులో హైపర్ ఆది వెరైటీ స్కిట్ వేశాడు. టీం లీడర్లు అందరినీ తీసుకొచ్చి స్పెషల్ స్కిట్ వేశాడు. అదిరి అభి, చలాకీ చంటి, తాగుబోతు రమేష్, హైపర్ ఆది ఇలా అందరూ కలిసి స్కిట్ వేశారు. ఇందులో వీరంతా స్కూల్‌కు వెళ్లే చిన్న పిల్లల్లా రెడీ అయ్యారు. నిక్కరు,షర్ట్ వేసుకుని స్టేజ్ మీదకు వచ్చారు. వారంతా రాగానే మనో, రోజాలు వారికి దండం పెట్టేశారు.

Hyper Aadi Satires On Roja And Mano
Hyper Aadi satires on Roja and Mano

అలా ఎందుకు దండం పెట్టారు అని అభి ఆదిని అడిగాడు. చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం కదా అందుకు వారు మనకు దండం పెట్టారుని అని కవర్ చేస్తాడు ఆది. ఆ తరువాత ఆది మళ్లీ తిరిగి రోజా, మనోకు దండం పెడతాడు. ఎందుకు దండం పెట్టావ్ అంటూ అభి మళ్లీ అడుగుతాడు. ముసలోళ్లకు కూడా దండం పెట్టాలి కదా అంటూ రోజా మనోల పరువు దీశాడు ఆది. ఆ మాటతో రోజా, మనో షాక్ తిని.. హైపర్ ఆదిపై ఫైర్ అయ్యారు. ఆ వెంటనే అనసూయకు దండం పెట్టి.. ఈమె కూడా ముసల్దే అని కవర్ చేశాడు. దీంతో రోజా కూల్ అయిపోయింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles