మమ్మల్ని మింగకండి.. హైపర్ ఆది గట్టిగానే వేశాడుగా!!

హైపర్ ఆది స్కిట్స్, అందులో ఆయన వేసే పంచులు, సెటైర్లు ఎంతగా ఫేమస్సో అందరికీ తెలిసిందే. అయితే హైపర్ ఆది తన స్కిట్స్‌లో తీసుకునే కాన్సెప్ట్ డైలాగ్‌లు తన చుట్టు పక్కల జరిగేవో, చూసినవో , లేదా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయినయో చూసి డైలాగ్‌లు రాస్తుంటాడు. అందుకే వాటికి జనాలు కూడా ఇట్టే కనెక్ట్ అవుతుంటారు. తాజాగా హైపర్ ఆది తన పరిస్థితి, జబర్దస్త్‌లో ఉన్న పరిస్థితిని తన సెటైర్ల రూపంలో వేసేశాడు.

Hyper Aadi Satire On Adirindi
Hyper Aadi Satire On Adirindi

అదిరింది, జబర్దస్త్ మధ్య ఉండే పోటీ, ఇక్కడి ఆర్టిస్ట్‌లకు అక్కడి తీసుకువెళ్లేందుకు జరిగే ప్రయత్నాలపై హైపర్ ఆది బాగానే కౌంటర్ వేశాడు. వచ్చేవారం హైపర్ ఆది తన స్కిట్‌లో బిచ్చగాళ్ల వేషం వేసినట్టున్నాడు. అయితే ఆ గెటప్‌లకు కూడా ఎంట్రీ సాంగ్ వేయించుకోవడంతో.. మనలాంటి అడుక్కునే వాళ్లకు కూడా ఎంట్రీసాంగ్ అవసరమా? అని శాంతి స్వరూప్ అంటాడు.

Hyper Aadi Satire On Adirindi
Hyper Aadi Satire On Adirindi

ఆ వెంటనే హైపర్ ఆది అందుకుని పంచ్‌ల ప్రవాహాన్ని మొదలెట్టాడు. ఈ ప్రపచంలో అడుక్కోని వారెవ్వరున్నారు. మనల్ని కామెడీ పెంచమని జడ్జ్‌లు అడుక్కుంటారు.. పేమెంట్లు పెంచమని మనం అడుక్కుంటాము.. క్లోజప్‌లు వేయమని అనసూయ అడుక్కుంటుంది.. వేరే షోలకు రమ్మని వాళ్లు అడుక్కుంటారు.. వద్ద ఇక్కడే ఉండమని వీళ్లు అడుక్కుంటారు.. మీరు మీరు కలిసి మమ్మల్ని మింగకండని మనం అడుక్కుంటాము అంటూ వరుసగా డైలాగ్‌లు చెప్పేశాడు. అంటే ఈ ఆర్టిస్ట్‌లను జబర్దస్త్, అదిరింది యజామాన్యాలు బాగానే ఒత్తిడి చేస్తున్నట్టున్నాయి.