Hyper Aadi: జబర్దస్త్ లో కనిపించని హైపర్ ఆది.. అసలు కారణం అదేనా..?

Hyper Aadi: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హైపర్ ఆది తన పంచ్ లతో ప్రేక్షకులను, జడ్జీలను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. జబర్దస్త్ షోలో జడ్జిని మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరి ని కవర్ చేస్తూ అందరి పై పంచులు వేస్తూ ఉంటాడు. జబర్దస్త్ లో కేవలం హైపర్ ఆది స్కిట్ కోసం చూసే వారు ఉన్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎక్స్ ట్రా జబర్దస్త్ కి సుడిగాలి సుధీర్ స్కిట్స్ ఏవిధంగానో, జబర్దస్త్ కి హైపర్ ఆది స్కిట్స్ ఆ విధంగా అని చెప్పవచ్చు.అంతేకాకుండా హైపర్ ఆది స్కిట్ లో ఎంట్రీ ఇవ్వడం వల్ల ఎంతోమంది వారి లైఫ్ లు మారాయి అని తెలిపిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఎంతో మంది కొత్త కొత్త ఆర్టిస్టులు హైపర్ ఆది స్కిట్ లో ఎంట్రీ ఇచ్చారు. సినీ తారలను సైతం హైపర్ ఆది తన టీంలో స్పెషల్ ఎంట్రీలను ఇప్పిస్తూ ఉంటాడు. లేటెస్ట్ ట్రేడింగ్ టాపిక్ లను తీసుకొని వాటిని తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా హైపర్ ఆది జబర్దస్త్ షో లో కనిపించడం లేదు. దీనితో హైపర్ ఆది ఎక్కడికి వెళ్ళాడు. హైపర్ ఆది పంచులు మిస్ అవుతున్నాం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ షో కి హైపర్ ఆది స్కిట్ హైలెట్ అన్న విషయం తెలిసిందే. అటువంటిది హైపర్ ఆది షోలో లేకపోతే ఆ షో రేటింగ్స్ ఏవిధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

చాలా మంది అభిమానులు హైపర్ ఆది లేని జబర్దస్త్ షో మేము చూడమూ అంటూ తిరస్కరిస్తున్నారు. యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ఈ వారం ఎపిసోడ్ కింద కామెంట్స్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. అయితే హైపర్ ఆది ఎందుకు రాలేదా అని అభిమానులు ఆరా తీయగా.. హైపర్ ఆదికి జబర్దస్త్ తో పాటు మిగిలిన షోలు చేస్తూ బిజీగా ఉండటంవల్ల జబర్దస్త్ షూటింగ్ కి వెళ్ళ లేక పోయాడని అని తెలుస్తోంది. పండుగ ఈవెంట్ లు,ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా వరుసగా ఈవెంట్లు ఉండడంతో జబర్దస్త్ హైపర్ ఆది రాలేకపోయాడు అని తెలుస్తోంది.