అనసూయను మళ్లీ ఇరికించాడుగా.. హైపర్ ఆది మామూలోడు కాదు!

Hyper Aadi Counters on Anasuya In Jabardasth

జబర్దస్త్ స్కిట్లలో అనసూయ, ఆది కాంబినేషన్‌కు సపరేట్ క్రేజ్ ఉంటుంది. అనసూయపై కోరికలు ఉన్నట్టు లేనట్టు.. ప్రేమ ఉన్నట్టు.. పులిహోర కలుపుతున్నట్టు అప్పుడప్పుడు హైపర్ ఆది వేసే సెటైర్లు బాగానే పేలుతుంటాయి. ఇక మధ్య మధ్యలో అనసూయ, యాంకర్ సీట్, జబర్దస్త్ కాకుండా మిగతా షోలు చేయడం వంటివాటిపైనా కౌంటర్లు వేస్తుంటాడు. మరీ ముఖ్యంగా యాంకర్‌గా అనసూయకు జబర్దస్త్‌ లోలోపల జరిగే వాటిపై పంచ్‌లు వేస్తుంటాడు.

Hyper Aadi Counters on Anasuya In Jabardasth
Hyper Aadi Counters on Anasuya In Jabardasth

తాజాగా హైపర్ ఆది మరోసారి అనసూయను గెలికాడు. వచ్చేవారం ప్రసారం కాబోతోన్న ఎపిసోడ్‌లో అనసూయను ఆది భల్లేగా ఇరికించాడు.తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఆది పంచ్‌లు బాగానే క్లిక్ అవుతున్నాయి. వచ్చే వారం జబర్దస్త్‌లో ఉప్పెన డైరెక్టర్, హీరో ఇద్దరూ కూడా గెస్ట్‌లుగా వచ్చారు. వారి కోసం ఉప్పెన అనే టైటిల్ వచ్చేలా ఓ డైలాగ్ రాసుకున్నాడు. రాజులా ఎంట్రీ ఇచ్చిన ఆది తన ముగ్గురు రాణిలతో సరసాలు ఆడుతుంటాడు.

ఏం కుళ్లుకుంటున్నావా? కావాలంటే నువ్వూ రావొచ్చు అని అనసూయపై ఆది కౌంటర్ వేశాడు. మేం ఇక్కడ ఉండగా మళ్లీ ఆమెను ఎందుకు పిలుస్తున్నావ్ అని ఓ ఆర్టిస్ట్ కౌంటర్ వేస్తుంది. దానికి సమాధానంగా ఆది రివర్స్ కౌంటర్ వేస్తూ.. మీరు అలల్లాంటి వారు.. వస్తుంటారు పోతుంటారు.. అనసూయ సముద్రం లాంటిది అక్కడే ఉంటుంది.. అంటూ యాంకర్ సీట్‌ను చూపించాడు. అంటే ఆమె యాంకరింగ్‌ను వదిలి పెట్టే ప్రసక్తే లేదని పరోక్షంగా పంచ్ వేసేశాడు.