కాజల్ పెళ్లిని కూడా వాడేశాడు.. హైపర్ ఆది మామూలోడు కాదు!

Hyper aadi ABout Kajal Marriage In Jabardasth

హైపర్ ఆది తన స్కిట్స్‌లో ట్రెండింగ్ టాపిక్ వాడతాడని అందరికీ తెలిసిందే. కాంటెంపరరీగా ఏ విషయం జరిగినా వాటిని తన స్కిట్స్ లో పెట్టుకుంటాడు. అందుకే ట్రెండ్‌కు తగ్గట్టు అదిరిపోయే పంచ్‌లు వేసి.. అందరికీ ఇట్టే కనెక్ట్ అయ్యేలా చేస్తాడు. అందులో భాగంగానే తాజాగా తన స్కిట్‌లో కాజల్ అగర్వాల్ పెళ్లిని వాడేశాడు. కాజల్‌కు వీరాభిమానిలా మారిన ఆది.. ఆమెకు పెళ్లి కావడంతో విరహ వేదన గీతాన్ని పాడుతూ ఎంట్రీ ఇచ్చాడు.

Hyper aadi ABout Kajal Marriage In Jabardasth
Hyper aadi ABout Kajal Marriage In Jabardasth

కాజల్‌కు పెళ్లి కావడంతో అభిమానులు ఎంతగా హర్ట్ అయ్యారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా కాజల్ పెళ్లి చేసుకోబోతోందని తెలియడంతో తెలుగు అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. వద్దు వద్దు అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. తాజాగా వాటి మీదే ఆది స్కిట్ వేశాడు. ఎలాగైనా కాజల్‌ను కలవాలని తమ ప్రేమను చాటాలని ఆది తన గ్యాంగ్‌ను ముంబైకి తీసుకెళ్లాడు.

అయితే ఈ స్కిట్‌లో ఆదితో పాటు పరదేశీ, శాంతి స్వరూప్‌తో పాటు పేరు తెలియని ఆర్టిస్ట్‌లు ఎంతో మంది ఉన్నారు. అందులో కాజల్ ఒకతను సెక్యూరిటీ గార్డ్‌లా వ్యవహరించాడు. ఇక పరదేశీ మహేష్ బాబు బిజినెస్ మేన్ మ్యానరిజంలో రెచ్చిపోయాడు. ఆ సెక్యూరిటీ గార్డ్‌తో.. ముంబైని ఉచ్చ పోయించడానికి వచ్చాను అని పరదేశీ అంటాడు. నిన్ను వైజాగ్‌లో పోయించింది గుర్తు లేదా? అని ఆది పక్కనుంచి కౌంటర్ వేయడంతో అందరూ నవ్వేశారు.