హైదరాబాద్ మీర్పేటలో చోటుచేసుకున్న దారుణ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య వెంకటమాధవిని హత్య చేసి, శరీర భాగాలను పొడిగా చేసి చెరువులో పడేశాడు. భార్యను హత్య చేయడానికి అతను ఓ వెబ్ సీరీస్ నుండి ప్రేరణ పొందినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
గురుమూర్తి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. ఆర్మీలో సేవలు అందించి పదవీ విరమణ పొందిన తర్వాత డీఆర్డీవోలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అతను మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలుసుకోవడంతో భర్త-భార్య మధ్య తరచూ గొడవలు జరిగాయి. సంక్రాంతి సందర్భంగా తన పిల్లలను బంధువుల ఇంటికి పంపించిన గురుమూర్తి, ఇంట్లో తన భార్యను హత్య చేశాడు.
హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకువెళ్లి ముక్కలుగా నరికిన గురుమూర్తి, వాటిని కుక్కర్ ల్ ఉడకబెట్టి చెరువులో పడేశాడు. పోలీసులు గురుమూర్తి ఫోన్ ను పరిశీలించగా, మరో మహిళతో ఉన్న ఫొటోలు లభ్యమయ్యాయి. నిందితుడు తన భార్యను అడ్డు తొలగించుకునేందుకు ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు.