ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు మంచి క్రేజ్ అండ్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో పాన్ ఇండియా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా ఒకరు. మరి రష్మికా ఇప్పుడు పలు భారీ చిత్రాలు హీరోయిన్ గా చేస్తుండగా ఈ గ్యాప్ లో ఆమెకి ఒక ఊహించని షాక్ ఎదురైంది.
నిన్న సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యిన ఆమె డీప్ ఫేక్ వీడియో ఒకటి సంచలనంగా మారగా ఆమె దానికి ఎంతో బాధపడుతూ పోస్ట్ కూడా పెట్టడంతో అసలు ఈ డీప్ ఫేక్ వీడియోలు ప్రెజెంట్ నడుస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వల్ల జరిగే ప్రమాదాలు ఏంటి అనేవి చర్చగా మారింది.
అయితే రష్మిక మందన్న విషయంలో జరిగిన దానిని మాత్రం అంతా ఖండిస్తున్నారు. ఏ ఐ ఎప్పటికి అయినా కూడా చాలా డేంజర్ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని రష్మిక కి ఆమె ఫాలోవర్స్ ధైర్యం చెప్తూ తన వెంట మేము ఉన్నామని అయితే తెలిపారు.
ఇక అలాగే ఆమెకి వారితో పాటుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అనేకమంది సపోర్ట్ అందిస్తూ ఆమె పట్ల వైరల్ గా మారిన వీడియోని ఖండిస్తున్నారు. మరి వారిలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రముఖ మహిళా పొలిటీషియన్ కవిత కల్వకుంట్ల అలాగే అక్కినేని నాగ చైతన్య ఇంకా అనేక మంది ప్రముఖులు అయితే రష్మిక మందన్నకి ధైర్యం చెప్తూ ఆ వీడియో పట్ల తగిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. దీనితో రష్మిక వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది.