సింగ‌ర్ సునీత రెండో పెళ్లి.. వ‌రుడు ఎవ‌రో తెలుసా?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న గానంతో పాటు డ‌బ్బింగ్‌తో కొన్ని ద‌శాబ్ధాలుగా అల‌రిస్తున్న ఫేమ‌స్ సింగ‌ర్ సునీత. త‌న గొంతు నుండి జాలువారిన ఏ పాట అయిన విన‌సొంపుగా ఉంటుంది. 40 ఏళ్ళ సునీత కొన్ని సంవ‌త్స‌రాలుగా మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఉంది. సింగ‌ర్‌గానే కాకుండా యాంక‌ర్‌గా, హోస్ట్‌గా కూడా సునీత అద‌ర‌గొట్టింది. ఆమెకు ప్ర‌త్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కెరీర్ ప‌రంగా బాగానే నిల‌దొక్కుకున్న సునీత ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం ఫ్లాప్ అయింది.

19 ఏళ్ల వ‌య‌స్సులో త‌న‌కి న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న సునీత ఇద్దరు పిల్ల‌ల‌కు కూడా జ‌న్మ‌నిచ్చింది. వారిప్పుడు సునీత‌తో పాటే ఉన్నారు. అయితే త‌న భ‌ర్త నుండి విడాకులు తీసుకున్న త‌ర్వాత సునీత రెండో పెళ్లి చేసుకుంటుందంటూ చాలా ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌యంలో ఓ సారి పెళ్లి ఆలోచ‌న లేద‌ని చెప్పుకొచ్చిన సునీత సింగిల్‌గానే ఉంటానంటూ పేర్కొంది.

సునీత త‌న రెండో పెళ్లి విష‌యంలో ప‌లుమార్లు క్లారిటీ ఇచ్చినప్ప‌టికీ, పుకార్లు మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా సునీత రెండో పెళ్లి చేసుకోనుంద‌ని, వ‌రుడు ఇత‌డే అంటూ క‌న్‌ఫాం కూడా చేశారు. అత‌ను తెలుగు డిజిటల్ మీడియా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ పెద్ద బిజినెస్ మ్యాన్‌ను సునీత పెళ్లి చేసుకోబోతుందని.. నిజానికి అతడికి కూడా ఇది రెండో పెళ్లి అని ప్రచారం అయితే జరుగుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియ‌దు కాని సోష‌ల్ మీడియాలో దీనిపై జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.