హరీష్ శంకర్ కూడా చుట్టెయ్యాల్సిందే.!

వేగంగా.. శరవేగంగా.. ఇంతవరకూ ఎవరూ చేయనంత స్పీడుగా.. ఇదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సినీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. ఔను, ‘వినోదియ సితం’ సినిమా రీమేక్‌‌కి సంబంధించి తన పార్ట్ షూటింగ్‌ని శరవేగంగా పూర్తి చేసేశాడు పవన్ కళ్యాణ్. టాకీ పార్ట్ పూర్తయిపోయింది. కొన్ని పాటలు షూట్ చేయాల్సి వుందట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సముద్ర ఖని వెల్లడించాడు.

మరి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాటేమిటి.? దర్శకుడు హరీష్ శంకర్ కూడా వేగంగా చుట్టెయ్యాల్సిందేనా.? తప్పదు, పవన్ కళ్యాణ్ వున్న పరిస్థితి అలాంటిది మరి.! విదేశాల్లో షూటింగులు వుండకపోవచ్చు. వీలైనంతవరకు హైద్రాబాద్ పరిసరాల్లోనే మమ అనిపించెయ్యాలట.

సెట్స్ వంటి వాటి గురించి ప్లానింగ్స్ దాదాపు పూర్తయిపోయాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం, షూట్ స్టార్ట్ అయిపోవడం జరిగిపోతాయట.! దాంతోపాటే.. అంటే సైమల్టేనియస్‌గా సుజీత్ ‘ఓజీ’ కూడా షూటింగ్ జరుపుకుంటుందట.