ఇప్పుడు టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాలతో పాటుగా తాను క్యామియో రోల్ లో నటించిన ఇంట్రెస్టింగ్ సినిమానే “బ్రో”. మరి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తుండగా ఇప్పుడు రిలీజ్ కి అయితే ఈ సినిమా సిద్ధం అవుతుంది.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా పై మంచి క్రేజ్ కూడా వచ్చింది. అయితే దీనికి కారణం డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ బ్రాండ్ అనే చెప్పాలి. కాగా ఇపుడు ఈ బ్రాండ్ నే నిర్మాతలు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట. దీనితోనే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఈ సినిమా హక్కులు 90 కోట్లు కోట్ చేస్తున్నారట.
అయితే సినిమాలో ఎంత మాస్ కంటెంట్ ఉన్నప్పటికీ పవన్ లిమిటెడ్ గానే కనిపిస్తాడు అలాంటిది 90 కోట్లు డిమాండ్ అంటే భారీ మొత్తమే అని చెప్పాలి. మరి ఇదంతా వెనక్కి వస్తుందో లేదో అనేది కూడా అనుమానమే. దీనితో అయితే పవన్ బ్రాండ్ ని మేకర్స్ ఇలా క్యాష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇంకా ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ అలాగే కేతిక శర్మ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా ఈ జూలై 28న సినిమా రిలీజ్ కి రాబోతుంది.