త్వరలోనే యుద్ధ భూమిలో కలుద్దాం బ్రో: తారక్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో కలిసి దేవర సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం తారక్ ఈ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. నేడు ఆయన 40వ పుట్టిన రోజు కాబట్టి కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖుులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.

అభిమానులు అయితే ఘనంగా వేడుకలు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ట్విట్టర్ వేధికగా తారక్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. అందులో వార్ సినిమా గురించి హింట్ కూడా ఇచ్చేశారు. హ్యాపీ బర్త్ డే తారక్.. యాక్షన్ ప్యాక్డ్ ఇయర్ మందు ఉంది. మనం యుద్ధభూమిలో కలుద్దాం మిత్రమా. మనం కలిసే వరకు సంతోషంగా, శాంతిగా ఉండు, పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా అని హృతిక్ రోషన్ ట్వీట్ చేశారు.

అయితే దీనికి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ రిప్లై కూడా ఇచ్చారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు థాంక్యూ సార్ అంటూ వివరించారు. అలాగే మీరు కూడా రోజులను లెక్కపెట్టుకోండని చెప్పారు. మీరు బాగా విశ్రాంతి తీసుకోండని చెప్పారు. అంతేకాకుండా యుద్ధభూమిలో మీతో పోరాటం చేసేందుకు చాలా ఆతతగా ఎదురు చూస్తున్నానని అన్నారు. అలాగే త్వరలోనే యుద్ధభూమిలో కలుసు కుందామంటూ ముగించారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్, యశ్ రాజ్ ఫిల్మ స్పై యూనివర్స్ ఫిల్మ్ వార్ సీక్వెల్ వార్-2లో తారక్ నటించనున్నారు. అంకా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. దీనికి ప్రముఖ దర్శక, నిర్మాత, యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా కథను అందించారట.

డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించి బ్రహ్మాస్త్ర సినిమాకు దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించారు. హైదరాబాద్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే వార్ -2 గురించి చర్యలు జరగడం.. తారక్ అందులో నటించేందుకు ఒప్పుకోవడం జరిగిపోయింది. ఈ ఏడాది చివర్లో వార్-2 ను పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.