ఫైమా, వర్ష ల పారితోషకమ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా మంచి పాపులారిటీని కూడా సంపాదించుకున్నారు. జబర్దస్త్ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోకి కొత్త కొత్త వారు ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో ఫైమా, వర్ష లు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షో కి ఎంట్రీ ఇచ్చిన వర్ష, పైమా అతి తక్కువ కాలంలోనే లేడీ కమెడియన్ లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

వర్ష తో పోల్చుకుంటే ఫైమా రోజురోజుకీ తనలో ఉన్న టాలెంట్ ని బయట పెడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. ఇక వీరిద్దరూ ప్రస్తుతం జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీమ్ లో చేస్తున్న విషయం తెలిసిందే. వర్ష, ఇమాన్యుయెల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది అన్న విషయం తెలిసిందే. వర్ష జంటగా పాపులారిటీని సంపాదించుకుకోగా, ఫైమా మాత్రం సోలో గానే చేస్తూ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఇకపోతే వర్ష ఇదివరకు సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీరియల్స్ కి గుడ్ బాయ్ చెప్పి కేవలం కామెడీ షో లకు మాత్రమే పరిమితం అయింది వర్ష.

ఇక ఫైమా, వర్ష లు స్టేజ్ పై ఒకే స్కిట్ లో కలిసి చేస్తే అందులో ఎక్కువగా ఫైమానే డామినేట్ చేస్తూ ఉంటుంది. అయితే రోజు రోజుకి ఫైమా లో ఉన్న టాలెంట్ టెంపు అవుతుండడంతో జబర్దస్త్ షో నిర్వాహకులు పైమాకి ఒక ఆఫర్ చేసి సంవత్సరంపాటు అగ్రిమెంట్ తీసుకుని వారితోనే ఉంచుకోవాలని ప్రయత్నిస్తుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం గాను ఒక ఎపిసోడ్ కి ఫైమా కి దాదాపుగా 50 వేల రూపాయలు ఇచ్చి మరీ అగ్రిమెంట్ చేసుకొని వారి వద్ద ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వర్ష విషయానికి వస్తే ఆమెకు ఒక ఎపిసోడ్ 10 వేల నుండి 15 వెల వరకు రెమ్యునరేషన్ ను అందిస్తున్నట్లు తెలుస్తోంది.