కాజల్ తెగించి అలా చేస్తానంటే హర్ట్ అయ్యేవాళ్ళు ఎంతమందో ..?

కాజల్ అగర్వాల్ కి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. కాజల్ చేతిలో ఉన్నవన్ని భారీ సినిమాలు.. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్సే. ప్రస్తుతం కాజల్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య చేస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ తో ఖైదీ నంబర్ 150 చేసి హిట్ అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం చిత్రీకరణ జరుపుకుంది.

Kajal Aggarwal to debut on Netflix with a web series

అంతేకాదు ఇంతక ముందు పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసిన కాజల్ మరోసారి పవన్ కళ్యాణ్ నటించబోతున్న సినిమాలో అవకాశం అందుకుందన్న సమాచారం. మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న మోసగాళ్ళు సినిమా లో కూడా కాజల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక హిందీ సినిమా ముంబై సాగా లో హీరోయిన్ గా నటిస్తుంది. క్రైం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాని సంజయ్ గుప్తా తెరకెక్కిస్తుండగా టి-సిరీస్ బ్యానర్ పై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మీ, సునీల్ శెట్టి కీలక పాత్రలు ఓషిస్తున్నారు.

అలాగే పాన్ ఇండియన్ సినిమా ఇండియన్ 2’ తో పాటు తమిళంలో ఇలయదళపతి విజయ్ – మురుగదాస్ దర్శకత్వంలో ‘తుపాకి 2’ సినిమాలో కూడా హీరోయిన్ గా కాజల్ అవకాశం దక్కించుకుందని సమాచారం. ఇలా ఇప్పటికే మొత్తం నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న కాజల్ ప్రియాంక చోప్రా నటించిన బ్లాక్ బస్టర్ ఇంటర్నేషనల్ సిరీస్ క్వాంటికో తెలుగు తో పాటు సౌత్ రీమేక్ లో కాజల్ నటించనుందని ప్రచారమవుతోంది.

అంతేకాదు ఇందులో కాజల్ బెడ్రూం సీన్స్ చేయడానికి అంగీకరించదని ప్రచారమవుతోంది. అయితే కాజల్ చేతిలో ఏకంగా పాన్ ఇండియన్ క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టుకొని ఇలాంటివి ఒప్పుకుంటుందా.. ఒప్పుకుంటే కాజల్ అలాంటి పాత్రల్లో ఫ్యాన్స్ చూసి ఎంతమంది హర్ట్ అవుతారో అని చెప్పుకుంటున్నారట. నిజమే కదా కాజల్ ని అలా చూడాలన్న ఆలోచన ఇప్పటివరకు ఎవరికీ అనిపించి ఉండదు.