స్వీటీ అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్ధం సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అరుంధతి సినిమా తర్వాత నుంచి టాలీవుడ్ లో అనుష్క సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్సాఫీస్ వద్ద ఉండే హడావుడి అందరికీ తెలిసిందే. ఇలాంటి సినిమాలు థియోటర్స్ లో చూస్తేనే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని భావించారు. కాని కరోనా మూలంగా థియోటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియక, ఓటీటీలో రిలీజ్ చేశారు.
ఆ ప్రభావమా లేక నిజంగా కథ ప్రేక్షకులని ఆకట్టుకోలేదా తెలీదు గాని ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా అందరినీ బాగా డిసపాయింట్ చేసింది. ఓటీటీలో రిలీజ్ చేశారు కాబట్టి అనుష్క కోసం అర్థరాత్రే సినిమా చూసేశారు. కాని ప్రేక్షకుల అనచనాలకి ఏమాత్రం లేదని బాగా డిసప్పాయింట్ అయ్యారు. అనుష్క కూడా ఈ సినిమ మీద బాగానే అంచనాలు పెట్టుకుంది.
కాని తనకి ఈ రిజల్ట్ రావడం కాస్త ఆశ్చర్యం కలిగించినదని అంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజయ్యాక కూడా చాలామందిలో హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. గత కొన్ని నెలలుగా ఈ సినిమా రిజల్ట్ మీదే నమ్మకం పెట్టుకున్న అనుష్క కి ఫ్లాప్ అన్న మాట వినడం తప్పలేదు. ఇక ఈ సినిమా రిజల్ట్ ని బట్టి తన ఫ్యూచర్ ప్లాన్స్ సెట్ చేసుకోవాలని అనుకున్న అనుష్క ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది ప్రకటించలేదు.
అయితే నిశ్శబ్ధం రిజల్ట్ అనుష్క ని డైలమాలో పడేసిందని తెలుస్తుంది. ఇప్పుడు తను కొత్తగా ఎలాంటి ప్రాజెక్ట్ కమిటవ్వాలన్న కూడా బాగా ఆలోచిస్తుందట. అయితే రెండు తమిళ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని .. ఆ రెండు సినిమాలు స్టార్ హీరోలు నటించబోతున్నవే అన్న టాక్ వినిపిస్తుంది. అయితే తెలుగైనా.. తమిళం అయినా నవంబర్ 7 న తన కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాలు వెల్లడికానున్నాయని సమాచారం. ఆరోజుకి ఉన్న స్పెషాలిటి అనుష్క శెట్టి పుట్టినరోజు కావడం.