శాకుంతలం కోసం హాలీవుడ్ ట్రిక్

సమంత నటించిన శాకుంతలం సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. శకుంతల పాత్రలో సమంతను చూడటానికి సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. శకుంతల – దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు సమర్పణలో నీలిమా గుణ నిర్మించారు.

అయితే ఎన్నడూ లేనిది శాకుంతలం ప్రీమియర్లు నాలుగు రోజుల ముందుగానే మొదలైపోయాయి. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ బిగ్ స్క్రీన్ లో ప్రత్యేకంగా పిలిచిన ఆహ్వానితులకు షో వేశారు. ఈ క్రమంలోనే దిల్ రాజు ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ కొన్ని విషయాలన తెలిపాడు. ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్యాట్రన్ ను ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నానని వివరించాడు.

హాలీవుడ్ లో నాలుగైదు రోజులు ముందుగానే స్క్రీనింగ్స్ వేస్తారని దిల్ రాజు చెప్పారు. ఆ పద్ధతిని కంటెంట్ మీద నమ్మకంతో ఇక్కడ కూడా మొదలు పెట్టామని వివరణ ఇచ్చారు. వినడానికి బాగానే ఉంది కానీ ఈ ప్యాట్రన్ వల్ల ప్లస్సులతో పాటు చాలానే మైనస్ లు కూడా ఉంటాయి. సినిమా చూసిన వాళ్లంతా సోషల్ మీడియా ద్వారా తమ ఫీలింగ్స్ ను బయట పెడతారు. అది ఒక్కోసారి ప్లస్ అయినా మరోసారి మైనస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే.

అయితే ఈ స్ట్రాటజీ రంగ మార్తాండకు పని చేయలేదు. కానీ లగం సినిమాకు చాలా బాగా వర్కౌట్ అయింది. మొదటి రోజు పెద్దగా లేని ఆక్యుపెన్సీలు క్రమంగా హౌస్ ఫుల్స్ దాకా వెళ్లిపోయాయి. ఈ ట్రెండ్ రెండు వైపులా పదునున్న ఆయుధం లాంటిది. దిల్ రాజు, నిర్మాత గుణశేఖర్ శాకుంతలం ఫలితం మీద చాలా నమ్మకంతో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాకి కనీసం ఒక్కరోజు ముందు షోల్ చేసే సాహసం చేయలేదు.

అలాంటిది సమంత పేరు మీదే మార్కెటింగ్ జరుగుతున్న సినిమాని ఇంత ముందస్తుగా ప్రేక్షకులకు చూపించడం సాహసం. అడ్వాన్స్ బుకింగ్స్ లో మెల్లగా పెరుగుదల కనిపిస్తోంది. ఎలాగూ బాక్సాఫీసు వద్ద నాని దసరా తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే శాకుంతలం జాక్ పాట్ కొట్టినట్లే. కాకపోతే యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావాలి.