క్రేజీ టాక్ : హాలీవుడ్ మేకర్స్ తెలుగులో ఈ స్టార్స్ వైపే చూస్తున్నారట..?

ఇప్పుడు మన తెలుగు సినిమా ఖ్యాతి ఏ లెవెల్లో ఉందో చూస్తున్నాము. ప్రపంచంలో అతి పెద్ద ఇండస్ట్రీ అయినటువంటి హాలీవుడ్ జనం కూడా ఇప్పుడు మన తెలుగు సినిమా కోసం మాట్లాడుతున్నారు. అంతే కాకుండా మన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ని ఆస్కార్ రేంజ్ కి కూడా తీసుకెళ్తున్నారు. 

మరి ఈ లెవెల్లో ఉన్న మన తెలుగు సినిమా నుంచి ఒకవేళ హాలీవుడ్ మేకర్స్ సినిమా తియ్యాలి అనుకుంటే మన స్టార్స్ కూడా కావాలి కదా మరి అలా వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నారో ఇంకో స్టార్ హీరో ఆల్రెడీ హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తాను చెప్పడం ఆసక్తిగా మారింది. 

తమిళ్ స్టార్ హీరో ధనుష్ కీలక పాత్రలో నటించిన “ది గ్రే మ్యాన్” ప్రమోషన్స్ లో మాట్లాడుతూ హాలీవుడ్ మేకర్స్ ప్రస్తుతం సౌత్ సినిమా స్టార్స్ వైపు చూస్తున్నారని వారు ఇప్పుడు ప్రభాస్ అలాగే రామ్ చరణ్ తో సినిమాలు చెయ్యడానికి ఆసక్తిగా ఉన్నారని తాను నేషనల్ మీడియాకి చెప్పాడు. 

దీనితో ఈ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది. మరి ఇది నిజం అయ్యి హాలీవుడ్ వాళ్ళు వీళ్ళతో ఎప్పుడు సినిమాలు చేస్తారో చూడాలి. ప్రస్తుతం అయితే ప్రభాస్ మరియు రామ్ చరణ్ లు తమ భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు.