టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక వరుసగా 1000 కోట్ల రూపాయల సినిమాల కలెక్షన్లను సాధించే సత్తా ఉన్న సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. రష్మిక మాట్లాడుతూ నా కాలు ఇప్పుడిప్పుడే నయం అవుతోందని ఆమె పేర్కొన్నారు. కానీ పూర్తిగా సెట్ కావడానికి ఇంకా 9 నెలల సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందని రష్మిక అన్నారు.
వర్క్ లైఫ్ లో నేను ఫుల్ బిజీ అయిపోయానని రష్మిక వెల్లడించడం గమనార్హం. జనవరి నెలలో జిమ్ లో వర్కౌట్ చేస్తున్న సమయంలో రష్మికకు గాయమైంది. రష్మిక ఓకే చెప్పిన కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కుబేర సినిమా జూన్ నెల 20వ తేదీన విడుదల కానుందని రష్మిక చెప్పుకొచ్చారు. కుబేర చాలా విభిన్నమైన చిత్రమని ఆమె కామెంట్లు చేశారు.
కుబేర సినిమా కోసం మీలాగే నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రష్మిక పేర్కొన్నారు. ప్రస్తుతం నేను లవ్ స్కాట్ అనే డ్రామా పూర్తి చేశానని ఫస్ట్ ఫ్రాస్ట్ అనే చైనీస్ డ్రామా కూడా బాగుందని రష్మిక వెల్లడించారు. ప్రస్తుతం అండర్ కవర్ హైస్కూల్ చూస్తున్నానని రష్మిక పేర్కొన్నారు. ఇప్పటివరకు నేను ఎన్నో కొరియన్ డ్రామాలు చూశానని అన్నీ నాకెంతో నచ్చాయని రష్మిక చెప్పుకొచ్చారు.
ప్రత్యేకంగా ఒక దాని గురించి మాత్రమే చెప్పాలనుకుంటే అది “ఓకే నాట్ టు బీ ఓకే” అని రష్మిక పేర్కొన్నారు. నాకు ఎత్తు, నీటి లోతు ఎక్కువగా ఉండే ప్రదేశాలు అంటే ఎంతో భయమని రష్మిక వెల్లడించారు. రష్మిక చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రష్మిక రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.
