ప్రదీప్‌పై క్రష్ .. అసలు నిజం బయటపెట్టిన హీరోయిన్ పూర్ణ

బుల్లితెరపై ఢీ షో ఎంతగా ఆదరణ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. అయితే గతంలో వచ్చిన సీజన్స్‌కు ఈ మధ్య వస్తోన్న సీజన్లకు ఎంతో తేడా ఉంది. అప్పుడు జడ్జ్‌లు, కంటెస్టెంట్లు, టీం లీడర్స్ అందరికీ తమకంటూ ఓ ప్రత్యేకత ఉండేది. కానీ ఇప్పుడు జడ్జ్‌లు, కంటెస్టెంట్లు, యాంకర్లు, టీం లీడర్లు అందరూ కలిసి దుమ్ములేపుతున్నారు. ముఖ్యంగా ఈ షోలో జంటల కెమిస్ట్రీనే హైలెట్ అవుతోంది.

Heroine Poorna Crush On Anchor Pradeep

ముఖ్యంగా ఢీ షోలో రష్మీసుధీర్ కెమిస్ట్రీ, రొమాంటిక్ పర్ఫామెన్స్‌కు ఫిదా కాని వారెవ్వరూ ఉండరు. ఒక్కోసారి వీరు చేసే డ్యాన్స్ పర్ఫామెన్స్ చూస్తే నిజంగానే వారిద్దరి మధ్య ఏదైనా ఉందేమోనన్న అనుమానం కలుగుతుంది. ఇక వీరికి తోడు వర్షిణిహైపర్ ఆది కూడా తోడయ్యారు. ఎప్పుడూ డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో ఈ జంట కూడా ఫేమస్ అయింది. ఇక తాజాగా కొత్త జంట పుట్టుకొచ్చింది.

Heroine Poorna Crush On Anchor Pradeep

మామూలుగా శేఖర్ మాస్టర్, ప్రియమణి మధ్య కూడా ఏదో ఉన్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు. కానీ తాజాగా మరో జడ్జ్‌గా ఉన్న హీరోయిన్ పూర్ణ తాజాగా తన మనసులోని మాట బయటకు చెప్పేసింది తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. పూర్ణ క్యారెక్టర్‌ను పోషిస్తూ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసింది ఓ కంటెస్టెంట్. ఢీ షోలో వచ్చాక నువ్ మారిపోయావ్ పూర్ణ అంటూ ఓ అమ్మాయి.. ఖడ్గం సినిమాలోని అహా అల్లరి అల్లరి చూపులతో అనే పాటకు ప్రదీప్‌ను చూసుకుంటూ డ్యాన్స్ చేసింది. ఇక ఆ పర్ఫామెన్స్ అయ్యాక పూర్ణ..నాకు ప్రదీప్ అంటే క్రష్ అని మనసులోని మాట బయట పెట్టేసింది. ఆ పై ప్రదీప్ కోసం స్టేజ్ మీదక వచ్చి రొమాంటిక్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఇక వీరిద్దరి రొమాంటిక్ స్టెప్పులతో ప్రోమోకే అందం వచ్చింది.