Hero Surya: ఒక్క మగాడు ఆయనే.. నెటిజన్ల ట్యాగ్‌తో ఎంజాయ్ చేస్తోన్న సూర్య!

Hero Surya: నటుడు సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సని అవసరం లేదేమో. ఆయన తీసిన గజని సినిమా టాలీవుడ్‌లో ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. దాంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ రాగా.. ఇక ఆ తర్వాత కూడా ఆయన పంథాలో దూసుకుపోతూ, తన వినూత్న నటనతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. కరోనా కాలంలో సూర్య హీరోగా నటించిన ఆకాశమే హద్దురా, జై భీమ్‌ సినిమాలు అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఓటీటీలో రిలీజ్ అయినా, వాటికి అభిమానుల నుంచి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఇవే సినిమాలు థియేటర్లలో రిలీజ్‌ అయితే కచ్చితంగా బాక్సాఫీస్ బద్దలైపోయేదే అని అప్పట్లో కొందరి టాక్ కూడా.

ఇక అందరు హీరోల్లాగా కాకుండా కథను ఎంచుకోవడంలో తనకంటూ ఓ స్పెషాలిటీని రూపొందించుకున్నారు సూర్య. సినిమా అంటే కేవలం వినోదం కోసం అని మాత్రమే అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ఆయన తీసే సినిమాలు సమాజంలో మార్పు తీసుకొచ్చేలా, పలువురికి ఆదర్శంగా నిలుస్తుండడం ప్రత్యేకం. జై భీమ్‌ సినిమాలో ఫస్ట్ 40 నిమిషాల వరకూ అసలు సూర్య పాత్ర కనిపించదు. అయినా కూడా ఆ సినిమా చేయడానికి ఆయన ఏ మాత్రం సందేహించలేదట. అదే స్థానంలో వేరే హీరోలు ఉంటే దాదాపుగా తిరస్కరిస్తారు. అంతటి గొప్ప వ్యక్తి సూర్య.

అంతే కాదు పేద అనాథ పిల్లలకు మరియు చిన్న వయసులోనే జబ్బుల బారిన పడుతున్న చిన్నారులకు సైతం సహాయం చేస్తూ మానవతా మూర్తిగా పేరు తెచ్చుకుంటున్నారు సూర్య. ఇకపోతే అతను చేసిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా చూసిన దర్శకుడు వెట్రిమారన్ సిగరెట్ తాగడం కూడా మానేశాడట. ఈ విషయాన్ని అప్పట్లో సూర్యనే రివీల్ చేశారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రేక్షకాభిమానులు నిజంగా సూర్య.. ఇండస్ట్రీకి ఒక్క మగాడు అనే ట్యాగ్‌తో పిలుస్తూ, ఆయన్ని ప్రశంసిస్తున్నారు.

ఇక జై భీమ్ తర్వాత సూర్య నటిస్తున్న మరో సినిమా ఈటీ. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు వెర్షన్‌కి సూర్యనే స్వయంగా తన డబ్బింగ్‌ని తానే చెప్పుకుంటున్నట్టు సమాచారం. కాగా ప్రపంచవ్యాప్తంగా మార్చి 10న విడుదలకానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.