ఉదయ్ కిరణ్ బయోపిక్.?

దివంగత హీరో ఉదయ్ కిరణ్.. ఒకప్పుడు యూత్ సెన్సేషన్. వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టి ఇండస్ర్టీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడీ యంగ్ స్టర్. ‘చిత్రం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఉదయ్ ‌కిరణ్‌ని ఇండస్ర్టీకి ఇంట్రడ్యూస్ చేసిన ఘనత డైరెక్టర్ తేజదే. అయితే, ఒకానొక టైమ్‌లో ఉదయ్ కిరణ్ కెరీర్‌లో చాలా స్ర్టగుల్ ఫేజెస్ చవి చూడాల్సి వచ్చింది.

అవకాశాల్లేక చాలా కష్టపడాల్సి వచ్చింది. అదే టైమ్‌లో వైవాహిక జీవితం కూడా బాగా లేకపోవడం, రకరకాల రూమర్లు సర్క్యేలేట్ కావడం.. ఇలా అనేక కారణాలు ఉదయ్ కిరణ్‌ని మానసికంగా దెబ్బ తీసేశాయని అంటారు. సరే, ఇదంతా తెలిసిన సంగతే. ఎప్పటి నుంచో ఉదయ్ కిరణ్ బయోపిక్ తెరకెక్కించాలని కొందరు మేకర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇంతవరకూ అవి కార్య రూపం దాల్చలేదు.

రీసెంట్‌గా ఆ ప్రయత్నాలు ముందుకు కదిలినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాత ముందుకొచ్చాడట. గతంలో ట్రై చేసిన డైరెక్టర్‌తోనే ఈ బయోపిక్ రూపొందించాలనుకుంటున్నాడట. ఉదయ్ కిరణ్ జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సినీ, వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలతో స్ర్కిప్టు వర్క్ చేయిస్తున్నాడట. త్వరలోనే అది ఓ కొలిక్కి రానుందనీ తెలుస్తోంది. అయితే, ఉదయ్ కిరణ్ పాత్రలో కనిపించబోయే ఆ హీరో ఎవరు.? ఏంటీ.? అనేది తెలియాల్సి వుంది.