Aishwarya Danush: కోలీవుడ్‌లో ఇటీవల విడిపోయిన స్టార్ కపుల్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే వారు ఎవరంటే హీరో ధనుష్, రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య. దాదాపు 18ఏళ్ల తమ వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్టు ఈ మధ్యే వారిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ అందుకు గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. ఇక నుంచి తామిద్దరూ మంచి స్నేహితులం మాత్రమే అని కూడా వారివురు తెలియజేయడం కొసమెరుపు. కాగా ఇద్దరూ విడిపోయాక ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు.
ప్రేమ వివాహం చేసుకున్న ఐశ్వర్య-ధనుష్, విడాకుల అనంతరం ఎవరూ కూడా ఒకరి గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే తొలిసారి ధనుష్ మాత్రం ఐశ్వర్య చేసిన ఒక పనిపై స్పందించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వారిద్దరూ విడిపోయిన తర్వాత ధనుష్ వరుస సినిమాలతో బిజీ కాగా, ఐశ్వర్య ఓ మ్యూజిక్ వీడియో డైరెక్ట్ చేయడంలో నిమగ్నమయ్యారు.
Thank you Dhanush….Godspeed https://t.co/XyP9lmnX3P
— Aishwaryaa.R.Dhanush (@ash_r_dhanush) March 17, 2022
ఇక వివరాల్లోకి వెళితే ఐశ్వర్య డైరెక్ట్ చేసిన మ్యూజిక్ వీడియోను ట్యాగ్ చేస్తూ నా స్నేహితురాలు ఐశ్వర్యకు అభినందనలు , గాడ్ బ్లెస్ యూ అంటూ హీరో ధనుష్ ట్వీట్ చేయడం ఇప్పుడు అందర్నీ షాక్‌కు గురిచేసింది. దానికి ఐశ్వర్య కూడా థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చారు. ఇక వారిద్దరూ విడియాక కూడా ఇలా స్నేహితులుగా కొనసాగడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ మ్యూజిక్ వీడియో తమిళ్ వెర్షన్ను సూపర్ స్టార్ రజినీకాంత్ విడుదల చేయగా.. తెలుగు వెర్షన్ ను అల్లు అర్జున్.. మలయాళ వెర్షన్ ను మోహన్ లాల్ విడుదల చేశారు.