ఎన్టీఆర్ “దేవర” కోసం నార్త్ విశ్లేషకులు ఏమంటున్నారంటే.!

గత ఏడాది టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన బిగ్గెస్ట్ హిట్ ఏదైనా ఉంది అంటే ఆ చిత్రం నిర్మొహమాటంగా గ్లోబల్ సెన్సేషన్ ఆర్ ఆర్ ఆర్ అని చెప్పాలి. కాగా దర్శకుడు రాజమౌళి హీరోలు రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లతో ఈ చిత్రాన్ని చేయగా ఈ చిత్రం గ్లోబల్ సెన్సేషన్ గా మారి ఏకంగా ఆస్కార్ వరకు కూడా వెళ్ళింది.

మరి ఇదిలా ఉండగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ అనంతరం ఇద్దరు హీరోల సినిమాలకి మరింత డిమాండ్ ఏర్పడగా లేటెస్ట్ గా అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం టాపిక్ వచ్చింది. అయితే ఈ చిత్రంతో ఎన్టీఆర్ నార్త్ స్టామినా ఏంటి అనేది కూడా ప్రూవ్ కావాల్సి ఉండగా..

మరి అసలు దేవర విషయంలో నార్త్ బెల్ట్ లో పరిస్థితి ఏంటి అనేది కొందరు ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. దేవర కి డెఫినెట్ గా హిందీలో మంచి ఓపెనింగ్స్ దక్కుతాయి అని RRR తో ఎన్టీఆర్ కి నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దీనితో ఖచ్చితంగా దేవర సినిమాకి మంచి వసూళ్లు అందుతాయి అని అంటున్నారు.

దీనితో నార్త్ లో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పాలి. అయితే ఇదే నార్త్ నుంచి హీరోయిన్ జాన్వీ కపూర్ సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ లు కూడా సినిమాలో ఉండడంతో ఇది సినిమాకి బాలీవుడ్ ఆడియెన్స్ విషయంలో మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అనే భారీ సంస్థ నిర్మాణం వహిస్తున్నారు.