ఆ సినిమాలో ప్రభాస్ కి తల్లి గా అలనాటి అందాలతార !

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. బాహుబలి విజయం తో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ .. ఆ తర్వాత వరుసగా పలు భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అతి త్వరలో రాధే శ్యామ్ అభిమానుల ముందుకు రాబోతుంది. తాజాగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వంలో స‌లార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలంగాణ‌లోని గోదావ‌రి ఖ‌ని జిల్లాలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ప్ర‌భాస్ త‌ల్లి పాత్ర‌లో అల‌నాటి అందాల న‌టి!

హై యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా, తాజాగా లొకేష‌న్ నుండి ప్ర‌భాస్ లుక్స్‌కు సంబంధించిన ప‌లు వీడియోలు విడుద‌ల అయ్యాయి. ఇందులో ప్ర‌భాస్ లుక్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. స‌లార్ చిత్రంతో పాటు ప్ర‌భాస్ ఆదిపురుష్‌, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడిక‌ల్ మూవీ చేయ‌నున్నాడు. ఆది పురుష్ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించ‌నున్నారు.

ఫిబ్ర‌వరిలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో ప్ర‌భాస్ రాముడి పాత్ర పోషించ‌నుండ‌గా, ఆయ‌న త‌ల్లి కౌశ‌ల్య పాత్ర‌లో హేమమాలి‌ని క‌నిపించ‌నుంద‌ని టాక్. ఇక లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్, సీత పాత్ర‌లో కృతి స‌న‌న్ న‌టించ‌నుంది. ఆగ‌స్ట్ 11, 2022 న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని క్రేజీ అప్‌డేట్స్ త్వ‌ర‌లో రానున్నాయి.