Om Rauth: ఇండియాలోనే పెద్ద హీరో అతనే… హీరో పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్!

Om Rauth: ఓం రౌత్… బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరున్న దర్శకుడు. ఆయన తీసిన సినిమాలన్నిటిలోనూ వైవిధ్యతను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు తీయడంలో ఆయన నేర్పరి అని చెప్పవచ్చు. కాగా ఆయన డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్ గురించి అందరికీ తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాలో ప్రభాస్ రాముని పాత్రల్లో కనిపించనుండడంతో ఈ పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటాడో, సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింగ్ గా మారాయి.

టోటల్ ఇండియాలోనే ప్రభాస్ చాలా పెద్ద స్టార్ అని, దేశంలోని ప్రముఖ దర్శకులంతా ఆయనతో సినిమా తీయాలని భావిస్తూ ఉంటారని ఓం రౌత్ అన్నారు. సినిమా కోసం ప్రభాస్ ఎంతైనా కష్టపడతాడన్న ఓం రౌత్, ఆయనలోని ప్రతిభను దర్శకులు వినియోగించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇతర హీరోలతో పోలిస్తే, అవతలి వాళ్ళకు గౌరవం ఇచ్చే విషయంలో ప్రభాసే ముందుంటాడని ఆయన కొనియాడారు.

అంతే కాకుండా ప్రభాస్ కళ్లతోనే హావభావాలను పలికిస్తారని, ఆయన మనసులో ఉన్న భావాలను కళ్లతోనే వ్యక్తం చేస్తారని ఓం రౌత్ తెలిపారు. ఇప్పటి వరకూ చూసిన ప్రభాస్ వేరు, ఆది పురుష్ లో కనిపించే ప్రభాస్ వేరు అంటూ ఓం రౌత్, ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ సినిమాను జనవరి 12, 2023లో విడుదల కానున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక రాధే శ్యామ్ సినిమాతో తీవ్ర నిరాశను మిగిల్చిన ప్రభాస్, ఈ సినిమాతోనైన బ్లాక్ బస్టర్ కొడతాడని ఆయన అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.