ఓ సినిమా ప్రెస్ మీట్ జరుగుతోంది. జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతున్నారు. హరీష్ శంకర్ గుస్సా అయ్యాడు. ‘ఇలాంటి సినిమాలు తెలుగులో వస్తాయా.?’ అని ఓ జర్నలిస్టు అడగడంతో, ‘స్పేస్’ తీసుకున్నాడు హరీష్ శంకర్.
‘డబ్బింగ్ సినిమాలు, రీమేక్ సినిమాలని వుండవ్.. సినిమా మాత్రమే..’ అని సెలవిచ్చిన దర్శకుడు హరీష్ శంకర్, అక్కడికేదో ఆ జర్నలిస్టుని ఏకి పారేశానని సంబరపడిపోతున్నాడు.
అసలు విషయం వేరే వుంది. హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వస్తోంది. అది రీమేక్ సినిమా. అంతకు ముందు పవన్ – హరీష్ కాంబినేషన్‌లోనే ‘గబ్బర్ సింగ్’ వచ్చింది. అదీ రీమేకే.
రీమేక్ విషయమై విమర్శలు ఎదుర్కొంటున్న హరీష్, సంబంధం లేని వివాదంలో వేలెట్టి కెలిగేసి, తన ‘కార్యం’ నెరవేర్చుకున్నాడు. తాను చేస్తున్నది రైటేనని చెప్పుకున్నాడు. స్వామికార్యం, స్వకార్యం.. అంటే ఇదే మరి.!