వైరల్ : పవన్ ఫ్యాన్స్ అతిపై హరీష్ శంకర్ ధ్వజం.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఆల్రెడీ కొంచెం మేర స్టార్ట్ చేసిన సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”. తన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేయనున్న చిత్రం తన చిత్రం భవదీయుడు భగత్ సింగ్ సినిమా ని కొత్త మార్పులు చేర్పులు చేసి అయితే ఈ కొత్త సినిమాని అనౌన్స్ చేశారు.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం గత కొన్నాళ్ల నుంచి పవన్ ఫ్యాన్స్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ ల మధ్య పెద్ద తగదా నే నడుస్తుంది. అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా రీమేక్ వద్దని హరీష్ శంకర్ కి గట్టిగానే అర్జీలు పవన్ ఫ్యాన్స్ పెట్టుకోగా హరీష్ శంకర్ చాలా మందిని బ్లాక్ చెయ్యడం కానీ వారికి కాస్త ఘాటుగా సమాధానం ఇవ్వడం గాని చేయడం లాంటివి చేసేవాడు.

అయినా కూడా పవన్ ఫ్యాన్స్ ఈ రీమేక్ గోల మాకు వద్దని సోషల్ మీడియాలో ప్రతి రోజు డిమాండ్ చేస్తూ ఉండడంతో హరీష్ శంకర్ కి అయితే చిర్రెత్తుకొచ్చింది. దీనితో చాలా మంది పవన్ ఫ్యాన్స్ లైన్ దాటేశారని ఇప్పుడు తనకి సినిమాపై ఇవ్వాలి అనుకున్న అప్డేట్స్ కూడా ఇవ్వబోవడం లేదని రీసెంట్ గా ఇచ్చిన ఓ మీడియా ఇంటర్వ్యూ లో తాను చెప్పాడు.

దీనితో ఈ పవన్ ఫ్యాన్స్ చేస్తున్న అతి పై ఈ రకంగా తాను ఇచ్చిన సమాధానం మరోసారి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయంలో అయితే తన నుంచి రానున్న రోజుల్లో ఎలాంటి అప్డేట్స్ ఉండవు.